బీఆర్ఎస్‌కు కాదు.. రాజకీయాలకే గుడ్‌బై అంటున్న మల్లారెడ్డి
కర్ణాటక డిప్యూటీ సీఎం, తెలంగాణ కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న డీకే శివకుమార్‌ను బెంగళూరులో మల్లారెడ్డి కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని తేలిపోయిందని వార్తలు మరింత వ్యాపించాయి.
గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్న వ్యక్తి ఎవరయ్యా అంటే అది మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డే. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డిని చెడామడా తిట్టినందుకు ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్ అంటే ఏమిటో స్వయంగా అనుభవిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాల్లో కట్టారంటూ మొన్న మల్లారెడ్డి కాలేజ్‌కు వెళ్లే రోడ్డు తవ్వేసిన అధికారులు, తర్వాత ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి కాలేజ్ బిల్డింగ్‌లు పడగొట్టేశారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని గట్టి ప్రచారం నడుస్తోంది. దీన్ని తాజాగా మల్లారెడ్డి కొట్టిపారేశారు.
బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ
కర్ణాటక డిప్యూటీ సీఎం, తెలంగాణ కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న డీకే శివకుమార్‌ను బెంగళూరులో మల్లారెడ్డి కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని తేలిపోయిందని వార్తలు మరింత వ్యాపించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్‌లో చేరడం తప్పనిసరన్న విశ్లేషణలూ వినిపించాయి.
వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయాల్లో ఉండను
అయితే డీకేని ప్రైవేట్ కార్యక్రమంలో కలిశానని, దానిలో రాజకీయం ఏమీ లేదన్నారు మల్లారెడ్డి. తన కుమారుడు భద్రారెడ్డికి ఎంపీ టికెట్ అడిగిన మల్లారెడ్డి కొన్ని రోజులుగా మళ్లీ ఆ మాట మాట్లాడట్లేదు. వచ్చే ఎన్నికల తర్వాత తానూ రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తానన్నారు.