బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేటీఆర్ కి బాగా నచ్చింది ఏంటంటే..?

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అన్ని హామీలు ప్రజలను ఆకట్టుకునేలా ఉన్నాయని అంటున్నారు నేతలు. కానీ మంత్రి కేటీఆర్ కి అందులో ఓ పథకం విపరీతంగా నచ్చిందట. అదేంటంటే..?

Advertisement
Update:2023-10-16 12:36 IST

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేటీఆర్ కి బాగా నచ్చింది ఏంటంటే..?

బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత తెలంగాణలో ఎక్కడ చూసినా దానిగురించే చర్చ. మీడియాలో ఆయినా, సోషల్ మీడియాలో అయినా ఆ పథకాల గురించే ప్రస్తావన. అయితే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అన్ని హామీలు ప్రజలను ఆకట్టుకునేలా ఉన్నాయని అంటున్నారు నేతలు. కానీ మంత్రి కేటీఆర్ కి అందులో ఓ పథకం విపరీతంగా నచ్చిందట. అదేంటంటే..?

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అన్ని వర్గాల్లో చర్చకు దారితీసింది. పేద ప్రజలకు సిలిండర్ 400 రూపాయలకే అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఈ పథకం ఓటర్లను ఆకర్షిస్తుందని అంటున్నారు. అయితే తనకు వ్యక్తిగతంగా బీమా పథకం అత్యంత ఇష్టమైనదని చెబుతున్నారు మంత్రి కేటీఆర్. 14 పేజీల మేనిఫెస్టోలో కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి ధీమా అనేది తనకు బాగా నచ్చిందన్నారు.


ఎందుకు ఇష్టమంటే..?

తెలంగాణలో రైతు బీమాను చూసి చాలా వర్గాల నుంచి బీమా కావాలని అభ్యర్థనలు వచ్చాయని, ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు మంత్రి కేటీఆర్. ఆయనతో సమగ్రంగా చర్చించి, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ బీమా అందించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అలా కేసీఆర్ బీమాకి బీజం పడిందని చెప్పారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా సమకూరుతుంది. రైతుబీమాకు చెల్లించినట్టే ఈ పథకం ప్రీమియం కూడా ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. అంటే ఏ పేద కుటుంబంలో అనుకోని దుర్ఘటన జరిగినా బీమా ద్వారా వారికి లబ్ధి చేకూరుతుంది. ప్రీమియం కట్టే బాధ్యత మాత్రం ప్రభుత్వం తీసుకుంటుంది. 

Tags:    
Advertisement

Similar News