BRSకు షాక్‌.. కాంగ్రెస్‌లోకి పట్నం ఫ్యామిలీ..?

పట్నం మహేందర్ రెడ్డిని కాదని 2018 ఎన్నికల్లో గెలిచిన పైలెట్ రోహిత్‌ రెడ్డికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ హైకమాండ్‌. దీంతో అప్పటి నుంచి ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update:2024-02-09 08:22 IST

మాజీ మంత్రి, BRS ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా మహేందర్‌ రెడ్డి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

పట్నం మహేందర్‌ రెడ్డి పార్టీ మారుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడం హాట్‌ టాపిక్‌గా మారింది.


ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో BRS తాండూరు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు మహేందర్ రెడ్డి. పట్నం మహేందర్ రెడ్డిని కాదని 2018 ఎన్నికల్లో గెలిచిన పైలెట్ రోహిత్‌ రెడ్డికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ హైకమాండ్‌. దీంతో అప్పటి నుంచి ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నెల 13న నల్గొండ జిల్లాలో కృష్ణా జలాల పరిరక్షణ కోసం భారీ బహిరంగ సభ తలపెట్టారు కేసీఆర్. దీంతో ఈ సభకు ముందే BRSకు షాకిచ్చేలా చేరికలకు కాంగ్రెస్‌ ప్లాన్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ సీఎం రేవంత్‌తో సమావేశమైందని తెలుస్తోంది. అ ఇతే కాంగ్రెస్‌లో చేరికపై పట్నం మహేందర్ రెడ్డి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News