పోలీసుల వలయంలో బాసర ఆర్జీయూకేటీ

మీడియా ప్రతినిధులపైనా ఆంక్షలు..రైల్వేస్టేషన్‌, బాసర అమ్మవారి ఆలయానికి వచ్చిన వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు

Advertisement
Update:2024-11-16 11:40 IST

నిర్మల్‌ జిల్లా బాసర పోలీసుల వలయంలో చిక్కుకున్నది. నాలుగు రోజుల కిందట స్వాతిప్రియ అనే విద్యార్థిని బాసర ఐఐటీలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళన చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై వివరాలు తెలుసుకోవడానికి వెళ్లిన ఏబీవీపీ నాయకులపై దాడికి నిరసనగా ముట్టడికి పిలుపునిచ్చారు. ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్జీయూకేటీ ప్రధాన గేట్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడంచల భద్రత ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌, బాసర అమ్మవారి ఆలయం వద్ద అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. ఏబీవీపీ నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను కూడా అనుమానంతో అరెస్టు చేస్తున్నారు. బైంసా నుంచి నిజామాబాద్‌ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. మీడియా ప్రతినిధులపైనా పోలీసులు ఆంక్షలు విధించారు. విలేకరుల సెల్‌ఫోన్లు తీసుకుని వీడియోలు డిలీట్‌ చేశారు. 

ఏబీవీపీ నాయకులపై దాడి చేయడం దుర్మార్గం: సంజయ్‌

ఏబీవీపీ నాయకులపై పోలీసులు, బాసర ట్రిపుల్‌ ఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న బాసర ఆర్జీయూకేటీ విద్యార్థినికి న్యాయం చేయమంటే విచక్షణారహితంగా దాడి చేయిస్తారా? బాసర ట్రిపుల్‌ ఐటీలో పరిస్థితి రోజురోజుక దిగజారుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా? విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదని సంజయ్‌ ప్రశ్నించారు. 

Tags:    
Advertisement

Similar News