తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా టార్గెట్‌.. ఎన్ని సీట్లంటే.!

తెలంగాణలో బీఆర్ఎస్ మునిగినట్లేనని.. కాంగ్రెస్‌ మునిగిపోవడానికి రెడీ అయిందన్నారు అమిత్ షా. తెలంగాణ ప్రజలు ఒక కుటుంబ పాలన నుంచి మరో కుటుంబ పాలనలోకి జారిపోయారని కామెంట్స్ చేశారు.

Advertisement
Update:2023-12-29 08:35 IST

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నేతలకు టార్గెట్ పెట్టారు ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచామన్న షా.. పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓట్ షేర్‌తో 10 లోక్‌సభ స్థానాలు గెలవాలని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి తెలంగాణలో బీజేపీ ఎంపీల సంఖ్య డబుల్‌ డిజిట్‌కు చేరాలని నేతలకు ఆదేశించారు.

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరిందని.. అది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 64 కావొచ్చు.. 95 కావొచ్చన్నారు. తెలంగాణలో భవిష్యత్తు పూర్తిగా బీజేపీదే నేతలకు అమిత్ షా స్పష్టం చేసినట్లు సమాచారం.

తెలంగాణలో బీఆర్ఎస్ మునిగినట్లేనని.. కాంగ్రెస్‌ మునిగిపోవడానికి రెడీ అయిందన్నారు అమిత్ షా. తెలంగాణ ప్రజలు ఒక కుటుంబ పాలన నుంచి మరో కుటుంబ పాలనలోకి జారిపోయారని కామెంట్స్ చేశారు. ఎస్సీ వర్గీకరణతో పాటు తెలంగాణకు ఇచ్చిన అన్ని హామీలకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు అమిత్ షా.

Tags:    
Advertisement

Similar News