పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ర్యాలీ

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడానికి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్యం చేస్తున్నాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు

Advertisement
Update:2024-10-22 15:08 IST

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. 27లోపు విడుదల చేయకపోతే చలో ఇందిరాపార్క్ నిర్వహిస్తామని వేలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ దిగ్బంధనం చేస్తామని మణికంఠ రెడ్డి అన్నారు. ఇవాళ ఏఐఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రంలో గత మూడు విద్యాసంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదల లేక విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఇబ్బందులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. కళాశాల సిబ్బందికి జీతాలు ఇవ్వలేక భవన కిరాయిలు చెల్లించలేక ప్రైవేట్ డిగ్రీ,పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత మూడు సంవత్సరాల నుండి ఫీజుబకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నాలుగు రోజులు బంద్ చేసిన ప్రభుత్వం విడుదల చేయకుండా పెడచెవిన పెట్టడం సిగ్గు చేటన్నారు. , గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంది అని మాట్లాడి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలు మొత్తం ఒకే సారి విడుదల చేస్తామని చెప్పిన ఆనాటి పీసీసీ అధ్యక్షుడు , నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్న ఇంతవరుకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని విద్యాశాఖ కూడా తన వద్దే పెట్టుకున్న విద్యాశాఖకి నిధులు కేటాయించి విద్యార్థులకు ఖర్చు చేయడం లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అక్రమ్ మాలిక్ ఉపాధ్యక్షులు బచ్చల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి మచ్చ నితిన్, ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి మంద రాకేష్, కౌన్సిల్ సభ్యులు వివిధ మండల కార్యదర్శులు అధ్యక్షులు రాజేష్,పొన్నం వేణు, అంకటి ప్రణయ్, నరేష్ ,ఫర్హాన్ అరవింద్, సోహైల్ ఆసిఫ్ గర్ల్స్ నాగలక్షమి సౌమ్య శిరీష ఫర్హాన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News