నిజాం చేసిన తప్పు వల్ల తెలంగాణ నష్టపోయింది: అసదుద్దీన్ ఒవైసీ
7వ నిజాం చేసిన తప్పు వల్ల తెలంగాణ నష్టపోయిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 1948 జూన్ 15న భారత ప్రభుత్వం ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన ఒక డ్రాఫ్ట్ ను ఉస్మాన్ అలీ ఖాన్ ఆమోదించి ఉంటే తెలంగాణకు చాలా లాభం కలిగేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Advertisement
తెలంగాణకు అద్భుతమైన లాభంకలిగే అవకాశాన్ని జారవిడిచి 7వ నిజాం తప్పు చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఎంఐఎం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ... 1948 జూన్ 15న భారత ప్రభుత్వం ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన ఒక డ్రాఫ్ట్ ను ఉస్మాన్ అలీ ఖాన్ ఆమోదించకపోవడం మూర్ఖత్వమన్నారు. ఆ డ్రాఫ్ట్ ను నిజాం ఆమోదించి ఉంటే కశ్మీరీలకు ఇచ్చిన ఆర్టికల్ 370 కన్నా ఎక్కువ లాభాలను తెలంగాణ పొందేదని, పైగా పోలీసు యాక్షన్ కూడా జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు.
నిజాం తన శక్తిని మర్చిపోయి అహంకారంగా ప్రవర్తించారని, పైగా లార్డ్ మౌంట్ బాటన్, ఖాసీం రిజ్వీ ఇద్దరూ నిజాంను మోసం చేశారని అసదుద్దీన్ చెప్పారు.
Advertisement