గ్రూప్-1 పరీక్షలకు భారీ బందోబస్తు : డీజీపీ జితేందర్
హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నమని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు
హైకోర్టు ఆదేశాల మేరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నమని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. పరీక్షల నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటమే తమ లక్ష్యమని డీజీపీ స్ఫష్టం చేశారు. టీజీపీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని అన్నారు.
పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. తెలంగాణలో అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా డీజీపీ తెలిపారు. దేశవ్యాప్తంగా వీధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు సిబ్బందికి నివాళులర్పిస్తామని తెలిపారు. ఇక సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని, ఈ ఘటనకు రాజకీయలు చేయటం సరికాదని డీజీపీ తెలిపారు.