కెప్టెన్ గా రోహిత్ శర్మ త్రీ-ఇన్-వన్ రికార్డు

భారత కెప్టెన్ కమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఓ అసాధారణ రికార్డు సాధించాడు. క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

Advertisement
Update:2023-02-11 12:00 IST

కెప్టెన్ గా రోహిత్ శర్మ త్రీ-ఇన్-వన్ రికార్డు

భారత కెప్టెన్ కమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఓ అసాధారణ రికార్డు సాధించాడు. క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

2023 టెస్టు క్రికెట్ సీజన్ ను భారత కెప్టెన్ రోహిత్ శర్మ కళ్లు చెదిరే సెంచరీతో మొదలు పెట్టాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టు తొలిఇన్నింగ్స్ లో రోహిత్ తన కెరియర్ లోనే అత్యుత్తమ శతకాన్ని నమోదు చేశాడు.

బ్యాటింగ్ కు, ప్రధానంగా స్ట్ర్రోక్ ప్లేకి అంతగా అనువుకాని పిచ్ పైన మిగిలిన బ్యాటర్లంతా పరుగుల కోసం తడబడుతుంటే..రోహిత్ మాత్రం అలవోకగా పరుగుల మోత మోగించాడు.

రోహిత్ మొత్తం 212 బంతులు ఎదుర్కొని 15 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 120 పరుగుల స్కోరుతో తనజట్టును పటిష్టస్థితిలో నిలిపాడు. రోహిత్ కెరియర్ లో ఇది తొమ్మిదో టెస్టు శతకం కాగా..ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం.

ప్రస్తుత నాగపూర్ టెస్టు వరకూ 46 మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ 9 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ, 14 హాఫ్ సెంచరీలతో సహా 3వేల 257 పరుగులు సాధించాడు.

రోహిత్ సాధించిన 9 సెంచరీలలో ఎనిమిది శతకాలు స్వదేశీ సిరీస్ ల్లో సాధించినవే.

కెప్టెన్ గా మూడు ఫార్మాట్లలోనూ...

ఓపెనర్ గా, కెప్టెన్ గా క్రికెట్ మూడు ( టీ-20, వన్డే, టెస్టు ) ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన భారత తొలి క్రికెటర్ గా రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

క్రికెట్ చరిత్రలో రోహిత్ కంటే ముందే ఈ రికార్డు అందుకొన్న బ్యాటర్లలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ ఉన్నారు.

అప్పుడు ఓవల్ లో..ఇప్పుడు నాగపూర్ లో...

ఓవల్ వేదికగా 18మాసాల క్రితం ఇంగ్లండ్ పై శతకం సాధించిన రోహిత్ ఇప్పుడు నాగపూర్ టెస్టు ద్వారా మరో శతకాన్ని పూర్తి చేయగలిగాడు. 2021 సెప్టెంబర్ తర్వాత రోహిత్ కు ఇదే తొలి టెస్టు శతకం.

స్వదేశీ టెస్టు సిరీస్ ల్లో అత్యధిక సగటు నమోదు చేసిన ఇద్దరు బ్యాటర్లలో రోహిత్ ఒకడిగా నిలిచాడు. స్వదేశీ సిరీస్ ల్లో 20 ఇన్నింగ్స్ లో

క్రికెట్ దిగ్గజం సర్ డోనాల్డ్ బ్రాడ్మన్ సగటు 98.22 కాగా..రోహిత్ శర్మ 88.00 సగటుతో రెండోస్థానంలో నిలిచాడు.

సొంతగడ్డపై ఆడిన టెస్టుమ్యాచ్ ల్లో ..మొత్తం 20 ఇన్నింగ్స్ లో 8 శతకాలతో వెయ్యికి పైగా సాధించడం ద్వారా రోహిత్ తన సగటును మెరుగుపరచుకోగలిగాడు.

ఓపెనర్ గా తొలిటెస్టులోనే శతకం...

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో ఓపెనర్ గా తొలిమ్యాచ్ లోనే శతకం బాదిన భారత నాలుగో క్రికెటర్ గా రోహిత్ మరో రికార్డు సాధించాడు. ఇంతకుముందే..

శిఖర్ ధావన్, రాహుల్, పృథ్వీ షా సైతం తమతమ టెస్ట్ అరంగేట్రం మ్యాచ్ ల్లోనే సెంచరీలు సాధించిన భారత క్రికెటర్లుగా నిలిచారు.

అంతేకాదు..ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లలో ఓపెనర్ గా శతకాలు బాదిన భారత తొలి క్రికెటర్ గా, క్రికెట్ చరిత్రలో 7వ ప్లేయర్ గా రోహిత్ గతంలోనే రికార్డుల్లో చోటు సంపాదించాడు.

ఆధునిక క్రికెట్ చరిత్రలోని మూడు ఫార్మాట్లలో ఓపెనర్ గా సెంచరీలు బాదిన క్రికెటర్లలో...క్రిస్ గేల్, బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్, తిలకరత్నే దిల్షాన్,

అహ్మద్ షెజాదే, షేన్ వాట్సన్, తమీమ్ ఇక్బాల్, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News