డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి భారత్‌

ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఆసీస్‌ టాప్‌లోకి

Advertisement
Update:2024-12-08 13:23 IST

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు మూడోసారి చేరాలనే భారత లక్ష్యానికి పింక్‌ బాల్‌ టెస్ట్‌ ఓటమి ఇబ్బందికరంగా మారింది. అడిలైడ్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియాపై ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం విదితమే. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దిగజారింది. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఆసీస్‌ టాప్‌లోకి దూసుకొచ్చింది. ఇక రెండో స్థానంలో సౌతాఫ్రికా కొనసాగుతున్నది. ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక, ఇంగ్లండ్‌ నిలిచాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి టాప్‌-2లో ఉన్న జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి.

అడిలైడ్‌ టెస్ట్‌ ముందు వరకు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 61.11 శాతంతో మొదటి స్థానంలో ఉండేది. ఈ మ్యాచ్‌ ఓటమితో పాయింట్ల శాతం 57.59 శాతానికి తగ్గి.. మూడో ప్లేస్‌కు పడిపోయింది. 57.69 శాతం నుంచి 60.71 శాతానికి పెరిగి ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకున్నది. ఇక సౌతాఫ్రికా 59.26 శాతంతో రెండో స్థానంలో ఉన్నది. శ్రీలంక 50 శాంతో నాలుగో స్థానంలో ఉండగా... న్యూజిలాండ్‌పై (44.23) విజయంతో ఇంగ్లండ్‌ (45.24 శాతం) ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది.

Tags:    
Advertisement

Similar News