డబ్ల్యూపీఎల్‌ లో బెంగళూరు గ్రాండ్‌ విక్టరీ

గుజరాత్‌ పై ఆరు వికెట్ల తేడాతో విజయం

Advertisement
Update:2025-02-14 23:57 IST

ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఫస్ట్‌ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. గుజరాత్‌ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. వడోదర వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఆష్లీ 79 నాటౌట్‌, బెత్‌ మాని 56, డియండ్ర 25 పరుగులతో జట్టు స్కోర్‌ లో కీలకపాత్ర పోషించారు. బెంగళూరు బౌలర్లలో రేణుక రెండు వికెట్లు పడగొట్టగా కణిక, ప్రేమ, జార్జియాకు తలా ఒక వికెట్ దక్కింది. 202 పరుగులు భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ దిగిన బెంగళూరు ఆదిలోనే ఓపెనర్లు స్మృతి మంథన, హాడ్జ్‌ వికెట్లను కోల్పోయింది. పెర్రీ 34 బంతుల్లో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేయగా, రిచా ఘోష్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌ తో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. 27 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. బెంగళూరు బ్యాటర్లలో బిస్త్‌ 25, అహుజా 30 పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో గార్డెనర్‌ కు రెండు వికెట్లు దక్కగా డాటిన్‌, సయాలికి ఒక్కో వికెట్‌ దక్కింది.

Tags:    
Advertisement

Similar News