లిక్కర్ స్కాం కేసులో ఈడీ తరపున వాదిస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా!

రాణా 2015 నుండి ఈడీకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, కాంగ్రెస్ నాయకుడు డి కె శివకుమార్, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్,అతని కుటుంబం, టిఎంసి నాయకుడు అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలతో సహా అనేక ముఖ్యమైన‌ కేసులలో ఆయన ఈడీ తరపున ప్రాతినిధ్యం వహించారు.

Advertisement
Update:2023-03-12 19:47 IST

వ్యక్తిగత కారణాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవికి న్యాయవాది నితీష్ రాణా శనివారం రాజీనామా చేశారు.

రాణా 2015 నుండి ఈడీకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, కాంగ్రెస్ నాయకుడు డి కె శివకుమార్, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్,అతని కుటుంబం, టిఎంసి నాయకుడు అభిషేక్ బెనర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలతో సహా అనేక ముఖ్యమైన‌ కేసులలో ఆయన ఈడీ తరపున ప్రాతినిధ్యం వహించారు.

అంతే కాదు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ , హఫీజ్ సయీద్, సయ్యద్ సలావుద్దీన్ వంటి ఉగ్రవాదులపై జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసు లలో ఈడీకి ప్రాతినిధ్యం వహించారు.

ఇంకా, ఎయిర్ ఇండియా "స్కామ్", విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, భూషణ్ పవర్ అండ్ స్టీల్, రాన్‌బాక్సీ-రెలిగేర్ మోసం, స్టెర్లింగ్ బయోటెక్ స్కామ్, పశ్చిమ దేశాలపై మనీలాండరింగ్ కేసుల వంటి హై ప్రొఫైల్ కేసుల‌లో కూడా రాణా ఈడీకి ప్రాతినిధ్యం వహించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కోర్టులో మనీలాండరింగ్ దర్యాప్తు సంబంధిత విచారణలో ఆయన‌ EDకి ప్రాతినిధ్యం వహించారు.

ప్రస్తుతం ఆయన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ఈడీ తరపున వాదిస్తున్నారు. అయితే హఠాత్తుగా రాణా రాజీనామా నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది తెలియరాలేదు.

Tags:    
Advertisement

Similar News