మీడియా మొఘ‌ల్ మ‌ర్దోక్ ఐదో వివాహం ర‌ద్దు..!

మ‌ర్దోక్.. స్మిత్‌తో వివాహ య‌త్నాల‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్టు ఆయ‌న స‌న్నిహితులు వెల్ల‌డించారు. 66 ఏళ్ల స్మిత్ అభిప్రాయాల‌తో ఆయ‌న‌కు పొస‌గ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని స‌మాచారం.

Advertisement
Update:2023-04-06 09:23 IST

మీడియా మొఘ‌ల్.. ఆస్ట్రేలియ‌న్ - అమెరిక‌న్ వ్యాపార వేత్త రూప‌ర్ట్ మ‌ర్దోక్ ఇటీవ‌ల ఐదో పెళ్లి స‌మాచారంతో వార్త‌ల్లో ప్ర‌ముఖంగా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల త‌న ప్రేయ‌సి ఆన్‌లెస్లీ స్మిత్‌తో జ‌రిగిన వివాహ నిశ్చితార్థం విష‌యాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. తాను మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ‌టానికి భ‌య‌ప‌డ్డాన‌ని, అయితే ఇదే త‌న చివ‌రి వివాహమ‌ని, చాలా సంతోషంగా ఉంద‌ని కూడా ఆయ‌న అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు.

అయితే తాజాగా త‌న ఐదో వివాహ ప్ర‌య‌త్నాన్ని ఆయ‌న ర‌ద్దు చేసుకున్న‌ట్టు తెలిసింది. వేస‌విలో ఈ జంట వివాహం చేసుకోవాల‌ని తొలుత భావించి.. ఆ మేర‌కు ఏర్పాట్ల కోసం ప్రణాళిక‌లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు హ‌ఠాత్తుగా ఆ ప్లానింగ్ అంతా నిలిచిపోయిన‌ట్టు తెలిసింది.

మ‌ర్దోక్.. స్మిత్‌తో వివాహ య‌త్నాల‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్టు ఆయ‌న స‌న్నిహితులు వెల్ల‌డించారు. 66 ఏళ్ల స్మిత్ అభిప్రాయాల‌తో ఆయ‌న‌కు పొస‌గ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని స‌మాచారం. న్యూస్ కార్ప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌, వ్యాపార వేత్త అయిన మ‌ర్దోక్ ఇప్ప‌టికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయ‌న త‌న రెండో భార్య అన్నా మ‌రియామ‌న్ నుంచి విడిపోయిన త‌ర్వాత‌ ఆమెకు చెల్లించిన భ‌ర‌ణం అత్యంత ఖ‌రీదైన‌ది కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ఏకంగా రూ.13,930 కోట్లు (1.7 బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తి) ఆమెకు చెల్లించ‌డం గ‌మ‌నార్హం.

చివ‌రిసారిగా 2016లో జెర్రీ హాల్‌ను నాలుగో వివాహం చేసుకున్న మ‌ర్దోక్ 2022లో ఆమెకు విడాకులిచ్చారు. ఆ త‌ర్వాత కొద్ది నెల‌ల వ్య‌వ‌ధిలోనే స్మిత్‌తో వివాహ నిశ్చితార్థం కూడా చేసుకున్న ఆయ‌న.. తాజాగా ఆ వివాహాన్ని ర‌ద్దు చేసుకున్నార‌నే వార్త‌లు చ‌ర్చనీయాంశంగా మారాయి.

Tags:    
Advertisement

Similar News