సుడిగాలి బీభత్సం.. ఐదుగుర్ని మింగేసింది
చైనాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో గ్వాంగ్‌జౌ ఒకటి. 12 కోట్లకు పైగా జనం ఇక్కడ నివసిస్తుంటారు. చైనా ఎగుమతలకు సంబంధించిన ప్రధాన నగరం గ్వాంగ్‌జౌ.
చైనాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌జౌ నగరాన్ని ఒక్కసారిగా సుడిగాలి కమ్మేసింది. దీంతో ఐదుగురు చనిపోయారు. 33మందికి గాయాలయ్యాయి. దాదాపు 141 ఫ్యాక్టరీ బిల్డింగులు దెబ్బతిన్నాయి. కార్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలాయి. వెంటనే రంగంలోకి దిగిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్ జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లు కూలిపోకపోవడంతో ప్రాణనష్టం తగ్గింది.
సుడిగాలులు, వరదలతో అతలాకుతలం..
చైనాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో గ్వాంగ్‌జౌ ఒకటి. 12 కోట్లకు పైగా జనం ఇక్కడ నివసిస్తుంటారు. చైనా ఎగుమతలకు సంబంధించిన ప్రధాన నగరం గ్వాంగ్‌జౌ. ఇక్కడ పెద్దపెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను సాగిస్తాయి. సుడిగాలి నేపథ్యంలో దాదాపు 141 ఫ్యాక్టరీలు దెబ్బతిన్నాయి. వారం కిందటే గ్వాంగ్‌జౌ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలు, వరదలతో నలుగురు చనిపోయారు. 1950 తర్వాత వరదలు ఇంతలా రావడం ఇదే తొలిసారి.
టోర్నడో బీభత్సాలు సాధారణమే..
చైనాలో సుడిగాలులు సర్వసాధారణం. గతేడాది సెప్టెంబర్‌లో టోర్నడో బీభత్సానికి 10మంది చనిపోయారు. 197 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 5వేల మందికి పైగా జనం నిరాశ్రయులయ్యారు. తాజాగా ఐదుగురు చనిపోగా.. 141 ఫ్యాక్టరీల బిల్డింగులు ధ్వంసమయ్యాయి.