చిక్కుల్లో మణిరత్నం సినిమా

చోళుల కథ ఆధారంగా తెర‌కెక్కుతున్న `పొన్నియిన్ సెల్వన్` సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సెల్వన్‌ అనే ఓ న్యాయవాది దర్శకుడు మణిరత్నం, ఆదిత్య కరికాలన్‌ పాత్ర పోషిస్తున్న విక్రమ్‌లకు లీగల్‌ నోటీసులు పంపారు.

Advertisement
Update:2022-07-21 06:53 IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం.. భారతీయ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్నారు. ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా.. దేనికదే ప్రత్యేకత. విభిన్నమైన కథాంశాలను ఎన్నుకోవడంతో పాటు.. ఆయన చిత్రీకరణ కూడా కొత్తగా ఉంటుంది. ఒక్క తమిళంలోనే కాగా.. దేశవ్యాప్తంగా ఆయన చిత్రాలకు అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ముంబై, రావణ్ వంటి చిత్రాలు వివాదాలకు కేంద్ర బిందువయ్యాయి. ఏది ఏమైనా మణిరత్నం చిత్రాలకు ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.

ఇదిలా ఉంటే ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న 'పొన్నియిన్‌ సెల్వన్‌' సినిమా వివాదాల్లో చిక్కుకుంది. చారిత్రక నేపథ్యం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్, ఐశ్వర్యరాయ్‌, కార్తి, త్రిష, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ప్రభు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. పాన్ ఇండియా మూవీగా రాబోతుంది.

పొన్నియిన్ సెల్వన్

చోళుల కథ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అయితే చారిత్రక నేపథ్యం ఉన్న‌ ఈ సినిమాలో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ సెల్వన్‌ అనే ఓ న్యాయవాది దర్శకుడు మణిరత్నం, ఆదిత్య కరికాలన్‌ పాత్ర పోషిస్తున్న విక్రమ్‌లకు లీగల్‌ నోటీసులు పంపారు. ఆ నోటీసుల్లో.. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్‌లో ఆదిత్య కరికాలన్‌ పాత్ర పోషించిన విక్రమ్‌ తిలకం ధరించి ఉన్నారని, చోళులు ఎప్పుడూ తిలకం ధరించినట్టు ఆధారాలు లేవని, మణిరత్నం చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని న్యాయవాది సెల్వం ఆరోపించారు. చరిత్రని తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నందున సినిమా విడుదలకు ముందే చూపించాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై మణిరత్నం ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News