Saindhav Movie | సైంధవ్ మూవీ నుంచి మరో లుక్

Saindhav Movie - వెంకటేష్ ల్యాండ్ మార్క్ మూవీ సైంధవ్. శైలేష్ కొలను డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్ రిలీజైంది.

Advertisement
Update:2023-07-17 15:07 IST
Saindhav Movie | సైంధవ్ మూవీ నుంచి మరో లుక్
  • whatsapp icon

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం 'సైంధవ్‌'. ఇప్పుడీ సినిమా నుంచి మరో లుక్ వచ్చింది. బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ అనేది దీని క్యాప్షన్. పోస్టర్‌ లో పాప వెంకటేష్‌ ను కౌగిలించుకోవడం చూడవచ్చు. పోస్టర్ లో వెంకటేష్‌ గాయాలతో కనిపిస్తున్నాడు. సినిమాలో సారా పాత్ర పేరు గాయత్రి.

'HIT' ఫ్రాంచైజ్ తో వరుస విజయాలు అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.

ఈ చిత్రంతో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖ్, వికాస్ మాలిక్ క్యారెక్టర్ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. శ్రద్ధా శ్రీనాధ్ మనోజ్ఞ పాత్రలో హీరోయిన్ గా నటిస్తుండగా, డాక్టర్ రేణుగా రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్ కనిపించబోతున్నారు.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా సైంధవ్ చిత్రాన్ని, అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయబోతున్నారు. కెరీర్ లో వెంకీకి ఇది 75వ చిత్రం కావడంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News