చిరునవ్వులు

అలనాటి ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రాసిన ఒకనాటి వ్యాసం

Advertisement
Update:2023-04-12 16:16 IST

నవ్వు నాలుగు విధాలచేటు యెలాగో నాకు తెలియదుగాని, రకరకాలుగా నవ్వేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు.ఈ నవ్వనేది తెప్పించుకుంటే వచ్చేది

కాదు. అభ్యాసం చేసుకుంటే

అలవాటయ్యేది అసలేకాదు. మనకు అర్థంగాని ఓ అనిర్వచనీయమైన ఆనందం రక్తంలో కదిలి నరాలను గిలిగింతలుపెట్టి ముఖంలోకి పాకి కళ్ళను ప్రకాశింపచేసి పెదవులను కదిలిస్తుంది.

కొంతమంది నవ్వుతుంటే యెంతో హాయిగా వుంటుంది. క్షణం సేపు మనవునికిని మనం మర్చిపోయి అందులో లీనమై పోతాం

ఈ కోవకి చెందిందే మా అక్కయ్య .కానీ అదేం ఖర్మమో ! అది చచ్చినా నవ్వదు. కొంతమంది

నవ్వుతుంటే చూడలేకఎదుటవాళ్ళకి

యేడుపొస్తుంది. మా ఇంటి పక్కన ఓ అయ్యంగార్ వున్నారు. ఆయన నవ్వుతుంటే బొళుక్ మని యెవరో

బకెట్ తో నీళ్ళు పారపోసి నట్లుంటుంది..

ఆయనకకి పూర్తి వ్యతిరేకం ఆయనభార్య. ప్రక్క నుంచి ఆవిడ నవ్వటం మనంయెవరైనా వింటే

ఆవిడ పాపం యెందుకో ఆగి ఆగి యేడుస్తోంది అనుకుంటాం.

ఇంకా కొంతమంది వున్నారు. వాళ్లునవ్వుతుంటే మనం యెన్నడూ కనీ వినీ యెరుగని శబ్దాలు వస్తాయి. మా వదిన నవ్వుతుంటే అదేమిటో కిసుక్కుమన్న ట్లుంటుంది మా బాబాయి నవ్వితే యెంతటి

శాంతమూర్తులకై నా సరే మా చెడ్డకోపం పచ్చేస్తుంది. అదేం చిత్రమో మరి !

ఆ మధ్య మాయింటికి మా నాన్న గారి

దూరపు చుట్టం ఒకాయన వచ్చారు. ఆయన మాట్లాడే 5 నిమిషాల్లో రెండు నిమిషాలుమాటలు,మూడు నిమిషాలు నవ్వువుండేవి .

ఆ నవ్వు గూడ సామాన్యమైంది కాదు, యిల్లెగిరి పోతుందేమోనని భయ మేస్తుంది. ఆయన నవ్వి ఆ పేసిన అరగంట వరకూ చెవుల్లో రండోళ్ళు బాదినట్లు

గింగురుమంటూనే వుంటుంది.

అందులో ఆయన వచ్చింది. సరిగ్గా మా పరీక్షల రోజుల్లో,

హాల్లో కూర్చుని

నాన్న గారితో మాట్లాడుతూ ఆయన నవ్వునవ్వుతుంటే గదిలో పుస్తకంలో తలదూర్చుకుని కూర్చున్న అన్నయ్య, జుట్టుపీక్కుని పిడికిలితో టేబిల్ మీద బాదేవాడు. అవును మరి - ఆ నవ్వుతో అదిరిపోయిన నరాలు చాలా సేపటివరకుపుస్తకంలో కన్పిస్తున్న అక్షరాల్లోఅర్థాన్ని గమనించటానికి ఒప్పుకునేవి కావు.

మనిషి వ్యక్తి త్వానికి మెరుగు

పెట్తుoది నవ్వు. స్వచ్ఛంగా హాయిగా విరగబడి నవ్వేసేవారికి

జీవితంలో చీకుచింతా వుండదంటారు. ఒక వేళ అలావుండిగూడ హాయిగా నవ్వే సెయ్య గలిగితే అది నిజంగా ఆ మనిషిలో వున్నసమర్థతకి చిహ్నం అనిపిస్తుంది.

యెవరో యే నూటికో, కోటి కో

ఒక్కరు తప్ప సహజంగా చిరునవ్వు

కళ్ళలోనూ, పెదవులచివరా సదా మెదులుతుండే మనిషిని పదేపదే చూడబుద్దవుతుంది కొంతమంది నవ్వుతుంటే చిగుళ్ళుబైటపడి వికృతంగా వుంటుంది. పెద్ద

పెద్ద పళ్ళున్న వాళ్ళు విరగబడి నవ్వటం బాగుండదు. వాళ్ళు నవ్వితే అదేదో భయంకరమైన శబ్దం చేస్తున్నట్లుంటుంది

మాకు తెలిసినాయన ఒకరున్నారు.

ఆయనకళ్ళు అసలే మిడిగుడ్లు — అందులో పల్లెత్తు, దానికితోడు ఆయన నవ్వటంమొదలు పెడ్తే యిహ ఆగటం అంటూ వుండదు. ఆ పళ్ళు - ఆ కళ్ళు - చూస్తే

భగవాన్ ! ప్రపంచంలో అసలు నవ్వటంఅనేది మనిషిలో యెందుకు పెట్టావు అనిపిస్తుంది

నవ్వటం నానా రకాలయితే ఫర్వాలేదు. మనం ఓనవ్వు నవ్వేసి వూరుకోవచ్చు. కాని కొంతమందికి నవ్వేటప్పుడు చిత్రమైన అలవాట్లుంటాయి. కొంత

మంది ముక్కుపుటాలు వుబ్బేలా చేస్తారు.ఇంకా కొంతమంది కళ్ళు చికిలిస్తారు. కొంతమందయితే ఆ దేదో ఆశ్చర్యం అనుభవిస్తున్నట్లు కనుబొమలు నుదురు మధ్యగా వచ్చేట్లు యెత్తేస్తారు. చాలామంది నోటికి జేబురుమాలో చేతులో అడ్డం పెట్టుకోటం నాకు తెలుసు. కొంత మంది అనవసరంగా పెదవులు బిగబట్టి లోపలి నవ్వుని బైటకు రానియ్యరు.

ఇలాటి అలవాట్ల యితే ఫర్వాలేదు.

ఎదటి వాళ్ళకి ప్రమాదం లేదు. కానికొంతమంది వున్నారు. వాళ్ళు నవ్వొస్తే

ప్రక్క వాళ్ళని బొదటమో, లేక గిల్లటమో యేదో ఒకటి చేస్తారు.

నా స్నేహితురాలు ఇందిర

ఓ అమ్మాయివుంది. ఆ అమ్మాయికి

సవ్వోస్తే ఒళ్ళు తెలియదు. నవ్వుతున్న

ప్పుడల్లా ప్రక్క వాళ్ళ వీపు శుద్ధి చేస్తుంది యీ అలవాటువల్ల క్రమేపి మిత్రులు గూడ శత్రువులుగా మారటం మొదలు పెట్టారు. పాపం తనుగూడ యెంతో

జాగ్రత్తగా వుండేది కాని ఆ సమయానికి మొదట అనుకోకుండా అలా

వచ్చే సేది.చివరకి ఓ సారి పెళ్ళయింతర్వాత-కాప రానికి వెళ్ళిన కొత్తలో భర్తతో సినిమాకువెళ్ళిందిట. ఆ సినిమా మొదటినుంచి చివర దాక ఒకటేనవ్వు. ఆ నవ్వులో యెక్కడో తన వునికిని మర్చిపోయిన యీవిడగారు చేయి చాచి తన పక్కనే కూర్చున్న ఓలావుపాటి వయసు మళ్ళినాయన్ని వీపు

మీద వేసేసింది. ఆయన 'అమ్మో' అని బిగరగానే అని, వీపు తడుముకుని ప్రక్కకు తిరిగి చూసాడు. చూస్తే ఆడ పిల్ల! ! సినిమా చూడటంలో మునిగిపోయిన యిందిర భర్తకి యిదేం తెలియదు ఆ పట్టున తలనొప్పిగా వుందని ,ఏం బాగా లేదని ,కళ్లు తిరుగుతున్నాయని బొమ్మలు కన్పించటం లేదని ఓంక పెట్టి

భర్త యివతలకు వచ్చేదాకా పూరుకో

కుండానే ఆట మధ్యలో లేచి వచ్చేసిందిట. పాపం నిజంగా బాధతో ఇదంతా చేస్తున్న ఇందిర్ని చూస్తే నాకు జాలి వేసింది. కాని అప్పటికీ యిప్పటికీ ఇందిర

మళ్ళీ యేవర్నీ కొట్ట లేదు అలా.

యెప్పుడు నవ్వబోయినా అమ్మో ' అన్న ఆయన కేక -ఆ చూపు గుర్తుకొస్తాయిట.

మా బావ అయితే సరేసరి. నవ్వొస్తే

మనిషి సరీగ్గా కూర్చోలేడు. యేమిటో

మెలికలు తిరిగిపోతాడు. కొత్తగా చూసే వాళ్లు అతను కడుపునొప్పితో బాధపడుతున్నాడు అనుకుంటారు.

ఇలా యే దురలవాట్లు

లేకుండా మొహంలో వికృతం కన్పించకుండా-ఆ నవ్వే ఒక ఆభరణం సుమా అన్నట్లు

నవ్వేవాళ్ళవంక చూస్తూ గంటలు గంటలు గడపవచ్చు. కొంతమంది యెంత నవ్వొచ్చినా సరే - విరగబడి నవ్వరు. ఆదోలా చిరునవ్వు నవ్వేసి వూరుకుంటారు.

మా నాన్న గారూ అంతే. ఆయనకి పట్ట లేనంత నవ్వొస్తే పెదవులమీద సన్నగా చిరునవ్వు రేఖామాత్రంగా గోచరిస్తుంది.

కాని, అర్ధరాత్రి వేళ నిశబ్దంగా వున్న ప్పుడు వీధిలో తాగుబోతు విపరీతంగా విరగబడి నవ్వేస్తుంటే చెట్లకున్న ఆకులు ,

ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు ,

వీటితోపాటు మన గుండెకూడ ఒణుకుతుంది. చాలా భయం వేస్తుంది. అసలుమానవ జీవితానికి

అర్థంయేమిటి

అన్న వేదాంతం పుట్టుకొస్తుంది.

ఆదే కల్లాకపటం లేకుండా హాయిగా

నవ్వేసే పసిపిల్ల బోసినవ్వులో

యెన్నో అందాలు కన్పిస్తాయి. అర్ధం గాక

పోయినా జీవితం చాలా సుందరం సుమా అన్న ధైర్యం కలుగుతుంది.

యేమిటో చిత్రం ! మనిషి మనసుకి యెన్ని అనుభూతులో!

యద్దనపూడిసులోచనారాణి (ప్రముఖ నవలా రచయిత్రి)

Tags:    
Advertisement

Similar News