కవితల కార్ఖానాలోన
కవులందరు కూలీలై
పదములెత్తి పాటగలిపి
పయనమైరి
పరుగులెత్తి.
అంశమేదయినా
అందమైన భాషలోన
అమ్మ భాష కమ్మదనము
పంచిపెట్ట పదుగురికి
మించి పోవు తరుణమని
మంచి మంచి పదాలను
మాయజేసి లాక్కొచ్చి
జున్ను వెన్న తినిపించి,
తియ్యనైన తేనెలోన బోర్లించి,
సుధను గుమ్మరించు
సంధులన్ని నేర్పించి,
సంతసాన
కవితలన్నిచంకనెత్తుకొంటిరి.
సావధానంగా సాయంత్రం
సాటి వారిని మెప్పించి
గూటికేగెడు పక్షులోలె
గుడిసె కేగిరి గుసగుసలై.
-శారద పొట్లూరి
Advertisement