పూర్వజన్మపుణ్యవశమున
పుట్టినానుభరతభూమిలో
ధర్మక్షేత్రము భరతభూమని
ధరణిమెచ్చంగన్ ....
మునులు ఋషులు విజ్ఞానవేత్తలు విశ్వశ్రేయము ధ్యేయమనుచునువిశిష్టకృషినిజేయవాటిఫలమునందంగన్...
సత్య ధర్మము శాంతి సౌఖ్యము
సర్వమానవ సౌభ్రాతృత్వము
చాటిచెప్పిన మేటిభూమిగ
జనులు కొనియాడన్ ....
పారతంత్ర్యము పారద్రోలగ
పట్టుదలగా ఒక్కటగుచు కష్టనష్టములెదుర్కొను
వీరులను తలవంగన్.
దేశమాత దాస్య దుస్థితి
కలచివేయగ కలతచెంది
కుటుంబాలను కూడ
వదిలిజైళ్లలో మ్రగ్గంగన్.....
త్యాగమూర్తులు ధర్మపరులు
దేశభక్తితొ ధీరులగుచూ
దివ్యస్పూర్తితొ ఎదురుతిరిగి
స్వేచ్ఛ పొందంగన్.
రెండువందల ఏళ్ళదాస్యపు
రెక్కలిరిచి బయిటకిసిరి
జాతికేతనమెగురవేసి
జయముపలుకంగన్...
భారతీయుల భాగ్యవశమున
బహుముఖములకృషిజరుగగ
అన్నిరంగములందు ఎదిగి
అభివృద్ధి గాంచంగన్. ..
వజ్రోత్సవ వేళయందున
విశ్వఖ్యాతి నొందినట్టి
భరతజాతి భాసిల్లి కీర్తిని
ప్రగతి గాంచంగన్....
వృధ్ధినొందిన దేశముందున
వికసించుచుండెడి వేళలందున
ఉద్యమించి దేశకీర్తి
వికసింప పూనంగన్ .
వాసికెక్కిన దేశమందున
ఉరకలేసి ఉద్యమించి
విశిష్టతను చాటుకుంటూ
ఉజ్వలత నొందంగన్..
సాగిపోదును సంతసమ్ముగ
సమస్యలను ఛేదించుకుంటూ
స్వతంత్ర్య వజ్రోత్సవభారతికి
సాష్టాంగ మొనరింపన్ ..
- దామరాజు. విశాలాక్షి (కెనడా)