కథకుడు, అనువాదకుడు, వ్యాస కర్త, సినీ రచయిత. ఈయన అనువదించిన గాడిద కథలు ప్రసిద్ధమైనవి
వ్యక్తిగత జీవితం
వీరు కృష్ణా జిల్లా, చౌటపల్లిలో ఏప్రిల్ 12, 1925 న జన్మించారు. ఆపై వీరి కుటుంబం పులపఱ్ఱు అనే సమీప గ్రామానికి వలస వెళ్ళింది. ఈయన చౌటపల్లి గ్రామంలో, కైకలూరులో ప్రాథమిక విద్యను పొందారు. హిందీ పరీక్ష విశారదలో ప్రథమంగా నిలిచారు. ఇంటర్మీడియట్ హిందూకళాశాలలో పూర్తి చేసారు.
1945లో విద్య పూర్తి అయ్యాక భారత జలసేనలో చేరారు. 1948లో B R W, K C G పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు. 1953లో భారత నావికాదళానికి రాజీనామా చేసారు. ఈయన భార్య చౌదరాణి ప్రముఖ సాహితీవేత్త, సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి చిన్న కూతురు. ఈమె కూడా కథలు, నవలలు వ్రాసారు. అప్పటి మద్రాసు (చెన్నై) లో తన సొంత పుస్తకాల విక్రయశాలను ప్రారంభించి నడిపారు. ఈమె 1996లో కన్ను మూసారు.
రచనా గమనం
నేవీ నుండి వచ్చేసిన తరువాత ఈయన తొలుత కొంత కాలం విశాలాంధ్ర తెలుగు దినపత్రికలో పనిచేసారు. 1962లో అప్పటి మద్రాసు (నేటి చెన్నై) కి వచ్చి సినీ రచయితగా మంచి పేరును సంపాదించుకున్నారు. రచయితగా ఎన్నో ప్రసిద్ధ రచనలు చేసారు. హిందీ నుండి తెలుగులోకి అనువదించిన వాటిలో గోదాన్, ప్రతిధ్వని, పేకముక్కలు, గాడిద ఆత్మకథ ముఖ్యమైనవి. అనువాదాలే కాక ఎన్నో కథలు, రేడియో నాటకాలు, ఇతరాలు రచించారు. మనసులో మనిషి చెప్పుకోదగ్గ రచన. గౌతమ బుద్ధ, వీరేశలింగం డాక్యుమెంటరీలకు చేసిన స్క్రిప్టు ఈయన రచన కౌశలతకు తార్కాణాలు. సినీ రచయితగా పైకొస్తున్న కాలంలోనే 1966 సెప్టెంబరు 26న గుండెపోటుతో మరణించారు.
రచనలు -కథలు
1. విముక్తి అభ్యుదయ (1946) 01-మే-1948 ఎ. పిచ్చేశ్వరరావు
2. వింత మరణం (1956) - జనవరి - అభ్యుదయ - మాసపత్రిక
3. పనిమనిషి అభ్యుదయ (1946) 01-మే-1956
4. వసుంధర అభ్యుదయ (1946) 01-ఏప్రిల్-1957
5. మరపే మెరుగు అభ్యుదయ (1946) 01-ఆగస్టు-1957
6. ఒక అనుభవం పుస్తకం 01-జనవరి-1960
7. జీవచ్ఛవాలు (పుస్తకం )
8. నెత్తరు కథ (పుస్తకం )
9. గడవని నిన్న (పుస్తకం)
10. కోరిన వరం (పుస్తకం)
11. ఆగస్టు 15న (పుస్తకం)
12 .వెర్రికాదు, వేదాంతం (పుస్తకం )
13.డొంకల వంకల మనసులు (పుస్తకం )
14. శాస్త్రి (పుస్తకం )
15.సబద్ధము (పుస్తకం)
16.కథకుడు (పుస్తకం
17. విముక్తి (పుస్తకం )
18.బ్రతకటం తెలియనివాడు
19.పరిచయం
20.పులి-మేక ఆట
21.గర్బస్రావం (పుస్తకం )
22 .తీరనికోరిక పుస్తకం
23.ఇదిప్పుడు మనదేశమే
24.ఎదురీత (పుస్తకం )
25.గడచిన దినాలు
26.వసుంధర (వసుధ)
27.చిరంజీవి
28. విముక్తి( ప్రజాసాహితి 01-ఏప్రిల్-1981)
29. నెత్తురు (ప్రజాసాహితి 01-సెప్టెంబరు-1997)
30.ఒక అనుభవం
రష్యన్ తెలుగు అనువాదాలు
1. పారిస్ పతనం ఇల్యా ఎహ్రెన్^బర్గ్
2. ఆదర్శజీవులు ఆంతోనీనా కొప్తాయెవ
3. బాగోగులు ఇల్యా ఎహ్రెన్^బర్గ్
4. అపరిచిత గలీనా నికొలయేవా