శృంగార నాయికలు : అభిసారిక

ప్రముఖ కవి ,ఫిడేల్ రాగాల డజన్,పఠాభి 'పన్'చాంగం ప్రయోగశీలి ,కన్నడ సినీ దర్శకుడు పఠాభి (తిక్కవరపు పట్టాభి రామిరెడ్డి) జయంతి ఫిబ్రవరి 19 స్మరిస్తూ వారు రాసిన ఓ శృంగారనాయికా గీతం)

Advertisement
Update:2023-02-19 17:02 IST

ప్రియుని గలయు కోరిక

లాగగ సుడిరీతిని

రయమున నభిసారిక

పోవు విజనవీదిని

అతి నీరవము నిశీధము

నిలచింది విహగ గీతము

భయదమ్ము రజని భూతము

అయినను, నిలుపవవ్వి నాతిని

రయమున పోవ విజన వీధిని

ప్రియుని గలయు కోరిక లాగగ సుడిరీతిని

పాటలు విని యామిని

పరుగులిడు భుజంగము

లాగ చనును కామిని

కోరి సఖుని సంగము

లాలసిండి మంద పవనము

నిదురిల్లు సర్వ భువనము

అతిశాంతము ప్రతి భవనము

రవముల జేయు హృది

మృదంగము

దడ దడ పరుగులిడు

భుజంగము

లాగున చన కామిని

కోరి సఖుని సంగము

కామ మటుల చీకటి

క్రమ్మియుఁడి భూమిని

పోవు పలపుటాకటి

త్రోపున జవగామిని

పదకంకణములు ఘల్లన

పులకించి తనువు ఝల్లన

విడిపింప బడిన విల్లన

చలిగోన, ప్రియుని ఆమని

పరుగుల దీయును జవగామిని

కామ మటులు చీకటి

క్రమ్మియుండ భూమిని

యౌవన మధు పూర్ణము

తన మనోహరాస్యము

అధర రక్తి మార్గము

పయిన శ్వేత హాస్యము

కని గాలి పిల్లలందరు

వివశత్వ మందియుం, దరు

తతి సందుల పడియుందురు

ప్రకటన జేయు హృద్రహస్యము

తనదు కనన్మనోహరాస్యము

అధరక్తి మార్గము పయిన శ్వేతహాస్యము

- పఠాభి

Tags:    
Advertisement

Similar News