మార్పు (కథానిక)

Advertisement
Update:2023-03-09 12:24 IST

సాకేత్, కల్యాణిలు కోహాబిటేషన్ కి సుముఖంగా లేరు. హితుడిగా, సన్నిహితుడిగాగిరిధర్ వాళ్ళిద్దరికీ సర్ది చెప్పడానికి ఎంత ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది.

ఇల్లు అమ్మడానికి వీల్లేదని, తాను ఆ ఇంట్లోనే ఉంటానని, తనకు అలవాటైన పరిసరాలు వదలివెళ్లనని పేచీ పెట్టి ఇల్లు పూర్తిగా తనపేరు మీద వ్రాయిం చేసుకుంది. ప్రతి నెలా సాకేత్ మూడు వేల డాలర్లు ఇవ్వాలన్ నజడ్జిమెంట్ విని ఉప్పొంగిపోయిం ది.

పిల్లలకు అయోమయం. సాకేత్ రెంటల్అపార్టుమెంటుకి మారవలసిన అవసరం.

కౌన్సిలింగుకి వెళ్ళడానికి ఆమె రానని భీష్మించుకుని కూర్చోటంవల్ల గత్యంతరం లేక అతను మూవ్ అయ్యాడు. పిల్లలు కస్టడీలో తల్లి దగ్గరే వున్నారు.

* * *

కాలచక్రంలో రెండున్నర సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి.

వింటర్, స్ప్రింగ్, సమ్మర్, ఫాల్ యధా ప్రకారం ఋతు ధర్మాలు నడుస్తూనే ఉన్నాయి.

జనవరి పదకొండవ తేది, ఉదయం పది గంటల సమయం. ఫ్యూనరల్ హోం లో కూర్చున్న కళ్యాణి తనకు తెలిసిన నూటరెండేళ్ల ధర్మదేవి అంతిమదర్శనానికి తనవంతు కోసం ఎదురు చూస్తోంది.

వెనుక వరుసలో ప్రారంభించి అందర్నీ వరుస క్రమంలో పిల్చారు.

భగవద్గీత చదివారెవరో. మరణిం చిన ఆమె గురించి కుటుంబ సభ్యులుమాట్లాడటం చూస్తున్న కల్యాణిలో మునుపెన్నడూ కలగనటువంటి తెలియని, విచిత్రమైన స్పందన కల్గింది.

అక్కడ కార్యక్రమం పూర్తి కాకుండానే, బరువైన గుం డెతో, నీళ్లు నిండిన కళ్ళతో బయటికి వచ్చింది. ఊబర్ కి ఫోన్ చేసి, అక్కడ నిలబడి నాలుగు వైపులాచూస్తోంది.

వింటరు కావటంవల్ల గత రాత్రి పడిన స్నో ఆకు పచ్చని పైన్, బాక్స్ వుడ్, సీడర్ చెట్లమీద అందంగా పొందికగా చిత్రకారుడు తన నైపుణ్యాన్నిప్రదర్శించినట్లున్నాయి. అక్కడ క్రిమెటోరియం, బరియల్ గ్రౌండ్ రెండూ ఉండే చోటు కావటంవల్ల కల్యాణికి అవన్నీ ఏదో భయాన్ని కల్గించాయి.

మై గాడ్,ఇన్ని వేల సమాధులు. పుట్టినవారు గిట్టక తప్పదని తెలిసినా ఎందుకింత వ్యధ? అనుకుంటూ, ఊబర్ ఎక్కి కూర్చుం ది. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.

ఇంటికి వెళ్ళగానే తలారా స్నానం చేసింది. మాటిమాటికి ఆ స్మశాన వాటిక కళ్ళముం దు కనిపించిం ది, పంచభూతాలు చేతులుచాపి తనని రారమ్మని పిలుస్తున్నట్లు ....

కడుపులోనుం డి ఏదో తెలియని బాధ, నరాలన్నీ మెలిపెట్టినట్లు , శరీరంలో ఒక్కసారిగా శక్తి ఉడిగిపోయినట్లు, నిస్సత్తువ తనీవేళ పిల్లల్ని తన చెల్లెలిదగ్గర దింపి వెళ్ళడం మంచిదయిం ది. లేకపోతే వంట కూడా చెయ్యవలసి వచ్చేది. ఈ రకమైన ఆలోచనలు ... ఏమిటో తనకేమీ చేయాలని లేదు.

బేగల్ తిందామనుకుని, దానికి కూడా శక్తి లేక పడుకుని, కొం తసేపు ఆలోచనలతో సతమతమై నిద్రపోయింది. అట్లా నిద్రపోయిన మనిషి మర్నాడు ఉదయం ఆరింటికి లేచింది.

వారం, రెండు వారాలు గడిచాయి.

ఎవరి ఆలోచనలో ఎప్పుడు ఏ సంఘటన, ఏ రకమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయో ఆ పరబ్రహ్మకే ఎరుక!.

కళ్యాణి ఆలోచించి ఎట్టకేలకు గట్టి కాంక్రీట్ నిర్ణయానికొచ్చిం ది.

లాయర్ గిరిధర్ కి ఫోన్ చేసిం ది. సుమారు నలభై గంటల తరువాత అతను కాల్ రిటన్ చేసాడు. తను కోర్ట్ కి వెళుతున్నాడు కాబట్టి సాయంత్రం మాట్లాడతాననీ చెప్పాడు. ముళ్ళ మీద కూచున్నట్టు సాయంత్రం వరకూ గడిపింది కల్యాణి.

కళ్యాణి ఆ రోజు సాయంత్రం సప్పర్ కాగానే పిల్లల్ని టీవీ చూడమని చెప్పి, గిరిధర్ కి ఫోన్ చేసింది. “సారీ అమ్మా నేను నీకు సహాయం చేయలేకపోతున్నందుకు” అన్న అతని మాటలు విని ఖంగుతిం ది. తన నిర్ణయంబ్రద్దలైంది. తన నిశ్చయం సమాధి అయింది.

ఇప్పుడేం చేయాలి? సాకేత్ కాళ్లబేరానికొస్తాడనుకుం ది, కానీ ఇంత సాహసం చేస్తాడనుకోలేదు.పిల్లల్ని రెండువారాలకొకసారి తీసుకెళ్లి మళ్ళీ దింపే టప్పుడు హాయ్ అనే మాట తప్ప, మరొకటిలేదు.

అతను షినిక అనే నల్ల పిల్లని పెళ్ళి చేసుకున్నాడని, ఆమెకి ఇద్దరు పిల్లలుఉన్నారని తెలిసి దు:ఖం ఆగలేదు. నెల గడిచింది.

మార్చి నెలలో సమయం ఒక గంట ముందుకి జరిగింది కూడా. కల్యాణి ఉదయం తొమ్మిదింటికి నిద్ర లేచి బ్రష్ చేసుకుం టూ కిటికీ లోంచి బయటికి చూస్తోంది. ఆకాశం లో పక్షులు కొన్ని వలయాకారం లోనూ, కొన్ని జంటలు గానూ, మరి కొన్ని భారతదేశ చిత్రపటం ఆకారం లోనూ ఎగురుతున్నాయి. ఒంటరి పక్షి ఒక్కటీ కనబడలేదు.

తను కూడా ఈ సింగల్ మదర్ జీవితానికి స్వస్తి చెప్పాలి. రేపటినుండిఅదే ప్రయత్నం లో ఉండాలి. తన పిల్లలను సొంత పిల్లలుగా చూసుకునే వాడికోసం వెతకాలి. ఒకవేళ అతనికి పిల్లలు ఉన్నా తను కూడా సొంత పిల్లల్లాగా చూసుకోగలగాలి, తెలుపు నలుపు బేధం ఉండకూడదు అనుకుంది కల్యాణి.

- కొమరవోలు సరోజ,

(టోరాంటో , కెనడా)

Tags:    
Advertisement

Similar News