జన్మంటూ ఉంటే

Advertisement
Update:2023-08-31 23:42 IST

నాకు అన్నయ్య లేరు.తమ్ముళ్ళే!

జీవన ప్రయాణంలో దైవం కలిపిన అన్నయ్య కామేష్ గారు. ఒక చెల్లిని అన్న ఎంత ప్రేమగా బాధ్యతగా చూస్తాడో అలా కామేష్ గారు నన్ను స్వంత చెల్లిలా చూశారు.విపుల చతుర పత్రికల సంపాదకురాలు ,ప్రముఖ కథారచయిత్రి దివంగత కె.బి లక్ష్మీ కి భర్త కామేష్ గారు

మేం ఎంతో కలిసి మెలిసి ఉన్నాం.ఆనందపు రోజులు.అన్నయ్య ప్రేమగా వచ్చి రాఖీ కట్టించుకునేవారు. నాకొక అన్న ఉన్నాడని ధైర్యం, గర్వం కలిగినరోజులు.విధి అన్నయ్యను తీసికెళ్ళినరోజు దిగ్భ్రాంతికి లోనై ..ఎంతో దు:ఖించాను. జన్మంటూ ఉంటే నేను, కామేష్ అన్నయ్య ఒక తల్లికి అన్న చెల్లిలా పుట్టాలి...రాఖీ అంటే నాఙ్ఞాపకం ఇదే!

-డాక్టర్ .చిల్లర భవానీదేవి

Tags:    
Advertisement

Similar News