కొన్ని సందర్భాలు

Advertisement
Update:2023-07-25 16:29 IST

తెలిసిన వారే

తెగువను నేర్పించిన వారే

రోజు రోజుకు కనుమరుగవుతున్నారు

అంచనాలు తరుగుతున్నాయి తప్పటడుగులు పెరుగుతున్నాయి 

అలసట లేకుండా మనసు తలంపులతో

తగువు లాడుతున్నది దారితప్పిన మనిషి

దరికి వచ్చేదెప్పుడో

మానవీయమైన

పందిరి కిందికి

మనమంతా చేరేదెప్పుడో...!          

నడిచిన బాటనే కావచ్చు కొత్తగా దర్శనమిస్తుంది

నడిచే మనుషుల ముఖాలు నిత్యం మారుతుంటాయి అందుకేనేమో 

ఊళ్ళో యాత్రికున్నై దారులన్నింటినీ పలకరిస్తుంటాను

పూలు వికసించిన తోటల్లా ఇప్పుడు బాటలన్నీ  మాటలతో విలసిల్లుతున్నాయి..!              

అనుభవాలు చెలిమెల వంటిది

గత కాలపు గుర్తులను తలచుకున్నప్పుడల్లా తడియారని స్పర్శలా  తనువంతా ఉప్పొంగుతాయి

తోడుకున్న కొద్ది

ఊరుతున్న జలంలా జీవనోత్సాహం ఉరకలేస్తుంది ఉరుముతున్న ఆందోళనలతో చెదిరి పోతున్న

నల్లని మబ్బుల్లా చెలిమలెప్పుడు ఇంకిపోవు అనుభవాలెప్పుడు వీడిపోవు..! 

- గోపగాని రవీందర్

Tags:    
Advertisement

Similar News