'పాద' సాముద్రికం (కథ)

Advertisement
Update:2023-03-02 19:50 IST

'బర్రెయ్య' నా చిన్నప్పటి స్నేహితుడు.

వాడూ, నేనూ ఒకే బళ్ళోచదివేవాళ్ళం.

నేను ముందు కూర్చుంటే, వాడు పిల్లల వెనకాల కూచొని 'అయ్య'వారిమీద మట్టిబెడ్డలు,

కాగితపు రాకెట్లు విసిరేవాడు.

ఓ రాకెట్టు తగిలి అణుక్షిపణి తగిలినట్లుపేట్రేగిపోయిన మాస్టార్ వాడిని చితకామతకా తన్నారు. అదే ఆఖరుసారి వాడుబడికి రావడం.

ఆ తర్వాత 'బర్రెల' వ్యాపారం మొదలుపెట్టాడు. నేను ఉద్యోగంలో స్థిరపడ్డాను.నిజానికి వాడికి ఐన్ స్టెయిన్ కున్నన్ని తెలివితేటలున్నా... అవకాశాలు లేక వుత్త స్టీమ్

ఇంజన్లా మిగిలిపోయాడు.

"నీ లెవల్కి 'బర్రె'లుకాదు! మనుషులతోవ్యాపారం చేయాలి" అన్నానోసారి వాడితో

"అంటే రాజకీయాలా? అది నాకిష్టంలేదు.యమ్.ఎల్.ఏ.లని, యమ్.పి.లని కొని,అమ్మడం, మందలాగ వాళ్లని తోలుకెళ్ళి

మెజారిటీ నిరూపించుకోవడం... నాకుససేమిరా రుచించదు. దానికన్నా ఈ అమాయక బర్రెలను మేపడంలోనే నాకు చాలా

ప్రశాంతత వుంది" అన్నాడు.

"అదికాదు. ఏ జ్యోతిష్య శాస్త్రవేత్తగానో,

వాస్తుపండితుడి లాగానో,'ఎయిడ్సు'ను

నయం చేస్తాననే ఆయుర్వేద విద్వాన్ లాగానో ప్రచారం చేసుకో. సక్సెస్ అయితేబోలెడన్ని డబ్బులు...

వాడు అనుమానంగా నావంక చూసి..."గోతిష్య శాస్త్రమంటే? " అన్నాడు.

"గోతిష్యం" కాదు.... జ్యోతిష్యo

అన్నాను.

"అదే చెయ్యి చూసిచెప్పడమే కదా... నాకసలు ఏమీ తెలియదు... అదీగాక సందుకొ చెయ్యి చూసి చెప్పేవాడున్నాడు కదా... ఈ రోజుల్లో..."

"పిచ్చివాడా! జులపాలజుట్టు, గడ్డం,

మీసాలు పెంచుకొని, కాషాయ వస్త్రాలు ధరిస్తే... ఎంతటి కష్టమర్ అయినా ఇట్టే చెయ్యిజాపుతాడు. అదీగాక మనం వెరైటీగా చెయ్యి

కాదు..."

"మరి?"

"... 'పాదం' చూసి భవిష్యత్ కాలం

చెబుతాం"

"ఆకాలితోనే మన ముఖం మీద ఈడ్చితంతారేమో !

"అందుకే 'పాలకోవాలాంటి చక్కటి

మాటలు చెప్పి వాళ్ళని బుట్టలో పడే

య్యాలి"!!

"ఎలా?

"ఏముంది? పాదాలు 'బండ'గా వున్నాయనుకో, 'ఏనుగు'ని గుర్తు తెచ్చుకో..ఏనుగు మృదువైన స్వభావం కలది... కాని

దానికి కోపం వస్తే మటుకు చాలా కష్టంకదా! ఆ లక్షణాలన్ని ఆపాదించి కష్టమర్కిచెప్పాలి....."

"అలాగా...

"సన్నటిపాదాలు అయితే 'గుర్రాన్ని'

స్మరించు....

బర్రెయ్య తడుముకోకుండా... "మీరు గుర్రంలా తేజోవంతంగా పనిచేస్తారు. కానిపరులు మిమ్మల్ని ఎక్కి 'స్వారీ' చేయాలను కుంటారు.ఆ విషయంలో జాగ్రత్తగా వుండండి అని చెప్పాలి అంతేకదా” అన్నాడు.

"... సెభాష్... చూశావా నీకెన్ని తెలివి

తేటలున్నాయో!?.

ఇది జరిగిన కొన్నాళ్ళకి...

పేపర్లో ఓ మూల ప్రకటన పడింది...

పాదవిద్యా విద్వాంసులు, శ్రీమాన్ 'బర్రీ'స్వామీజీ హిమాలయాల్నించి రాక... అనివుంది.

తీరా చూస్తే... మా 'బర్రెయ్యే...

వాడ్ని కలుసుకుందామని 'అడ్రస్' తెలుసుకొని వెళ్ళాను. ఆ మహానగరంలో ఓఫైవ్ స్టార్ హోటల్లో ఆరవ అంతస్థులోరూమ్ అద్దెకు తీసుకున్నాడు. అది పూర్తి

ఎయిర్ కండిషన్డ్... అక్కడ గాలి కూడాసువాసన భరితంగా వుంది. దానితోపాటుఎయిర్ హోస్టెస్లాంటి అందమైన ఆడపిల్లలు వర్క్ చేస్తున్నారక్కడ...

హాలు మధ్యలో మావాడి 'సింహాసనం'చుట్టూ గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ,అమితాబ్ లాంటి ప్రముఖుల ఫొటోలువాటికింద వ్యాసాలు...

నన్ను చూసి ఆనందంగా కౌగలించుకున్నాడు. సాదరంగా ఆహ్వానించాడు. "నీదయవల్ల వ్యాపారం(?) బావుందిరా! నీ

సలహా విన్నాక తిన్నగా 'కాశీ' వెళ్ళి అక్కడమెయిన్ బ్రాంచి స్థాపించాను... అది పాపులర్ అయ్యాక... సైడ్ బ్రాంచెస్ వోపెన్ చేశాను" అన్నాడు.

అతని బిజినెస్ ఆర్జన విన్నాక నాకూ

ఉత్సాహం కలిగి "నా పాదాలు ఓసారి

చూడవా...? " అన్నాను.చూశాక చెప్పాడు.

"మీవి కుందేలుపాదాలు. చక్కటి సలహాలు చెప్పి, ఇతరులను పైకి తీసుకురాగలరు. మీరుమాత్రం

ఎప్పుడూ ఒకేలా వుండిపోతారు".

డా. కె. శివసుబ్బారావు

Tags:    
Advertisement

Similar News