అజ్ఞాన తిమిరంబు
నన్నావహింపంగ
కన్నులుండెనుగాని
కన్పడదు నాకేమి
ఈచీకటింటిలో
ఎన్నెన్నో శత్రువులు
బాహ్యమైనవికొన్ని
లోలోపలవికొన్ని
ఈనీటి బుడగలో
ఎన్నెన్నో బంధాలు
వచ్చిపడినవి కొన్ని
తెచ్చుకున్నవి కొన్ని
ఎన్నిజన్మలు కాని
ఎంత కష్టము కాని
చీకటిని చీల్చుకొని
పరుగెత్తి పరుగెత్తి
దీపకళికను చేరి
వెలుగులో బ్రతకాలి !!
Advertisement