ఒకప్పుడు:
"సుమిత్ర ఈయనెవరో నీకోసమే వచ్చారు ".చూడు అంది మాధవి..
పెద్ద వయసు వ్యక్తి
."ఏంది పని పెద్దయ్య"అంది సుమిత్ర
"సర్టిఫికేట్ ఇంకా రాలేదమ్మా. నీ బెంచ్ దగ్గరే ఉందంట." అన్నాడు వినయంగా.
"ఇదిగో ఇప్పుడప్పుడే అవ్వదులే .ఒక వారం తర్వాత కనబడు." అంది నిర్లక్ష్యంగా
"చూడమ్మా.ఇలా కాదు కానీ.ఎంత కావాలో చెప్పు "అన్నాడు.
"పన్నెండు వేలు.రేపు ఈ పాటికి ఇచ్చెయ్.సాయంత్రం ఈ పాటికి సర్టిఫికెట్ తీసుకుపో "అంది చిరునవ్వుతో అతడికి మాత్రమే వినిపించేలా.
ఆ వృద్ధుడు మౌనంగా వెనుదిరిగాడు.
ఇప్పుడు:
ఆ రోజు ఆఫీస్ లో ఫంక్షన్.
" వావ్ సుమీ.నీ బుట్టకమ్మలు సూపర్. నెక్లెస్ ధగధగ మెరిసిపోతోంది."అంది మాధవి.
"పోయిన వారం జాయ్ అల్యుకాస్ లో కొన్నానే" అంది.
అప్పుడే అజయ్ ఫోన్ చేసి హెడ్డాఫీస్ కు పనిమీద హిందూపురం
వస్తున్నాను.కలుద్దామని చెప్పాడు.
సుమిత్ర గుండె వేగం పెరిగింది.
అజయ్ తనతో పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత మొదటిసారి కలుస్తున్నాడు.
మధ్యాహ్నం మూడు గంటలు కావస్తున్నా అజయ్ రాకపోవడంతో భోజనం సంగతి కూడా మర్చిపోయింది . అజయ్ హెడ్డాఫీసులో ఆలస్యం అవుతోంది అని ఫోన్ చేసి చెప్పాడు.
సాయంత్రానికి ఆఫీస్ కు కాకుండా ఇంటికే వచ్చాడు అజయ్.
రాగానే ఎంతో సంతోషంగా ఎదురెళ్లిన సుమిత్ర ను చూస్తూనే
" ఏంటిది.ఆ కమ్మలేంటి ? ఆ చీర.? ఆ బంగారు నగలు? అంటూ మొహం చిట్లించాడు
" అరె.చాలా ఖర్చయింది ఇవి కొనడానికి.మీకు నచ్చలేదా అంది డల్ గా.
" ఊహూ నచ్చలేదు. నువ్ సింపుల్ గా ఉంటేనే నాకు నచ్చుతావు" అన్నాడు హాల్ లో కూర్చుంటూ
"సరే అండి" అంటూ వంటగది లోకి వెళ్ళి అతనికి వేడిగా కాఫీ కలిపి ఇచ్చి స్నాక్స్ తెచ్చిచ్చి తన రూంలోకి వెళ్లిపోయింది .సుమిత్ర తల్లి అజయ్ తో మాట్లాడుతూ ఉండగానే సుమిత్ర సింపుల్ గా ఉండే కాటన్ చీర కట్టుకుని మెడలో చిన్న చైన్ చెవులకు చిన్న బుట్ట కమ్మలు పెట్టుకొని తన పొడవాటి జడలో మల్లెలతో హల్ లోకి వచ్చి అజయ్ ఎదుట నిలబడింది.
అజయ్ కనురెప్పలు ఆర్పడం సైతం మర్చిపోయి సుమిత్రనే చూస్తుండడంతో ఆ చూపులో తీక్షణత సుమిత్ర మదికి తాకి సుమిత్ర అందంగా కనిపిస్తోందని అతను చెప్పకపోయినా అతని చూపులు చెబుతున్నాయని అనిపించింది.
----
ఇంకో రోజు ఉండమని సుమిత్ర తల్లి బతిమాలినా అజయ్ ఆఫీస్ పనులున్నాయని ఆ రోజు రాత్రి ట్రైన్ కు బయలుదేరి విజయవాడ కు వచ్చేశాడు .పెళ్ళి చీరలు , నగల
కోసం సుమిత్ర ను విజయవాడ కు రమ్మన్నాడు.ఇంకో వారం లో పెళ్లి.ముఖ్యంగా మరుసటి రోజు అజయ్ బర్త్ డే
చాలా సంతోషంగా ఉత్సాహంగా వెళ్ళింది సుమిత్ర.అజయ్ బర్త్ డే రోజు ఉదయాన్నే ఇద్దరు గుడికి వెళ్లి పూజలు చేయించారు .భోజనం సమయానికి దగ్గర్లోని అనాథాశ్రమం కు వెళ్లారు. అజయ్ ఫ్రెండ్స్ అప్పటికే హోటల్ లో ఆర్డర్ ఇచ్చి చేయించిన భోజనాలను ఇద్దరు దగ్గరుండి అనాథలకు అందించారు. సుమిత్ర కు చాలా తృప్తి గా అనిపించింది.ఆ రోజు సాయంత్రం దగ్గర్లోని పార్క్ కు వెళ్ళి కాసేపు గడిపి తమ అపార్ట్మెంట్ కు చేరుకున్నారు..
చదవడం పూర్తయ్యేసరికి సుమిత్ర మనసంతా ఒక వైపు సంతోషం ఇంకో వైపు ఇదీ అని చెప్పలేని భావన.నిజానికి తన కంటే కూడా అజయ్ ఎక్కువ ప్రేమించాడు అని అర్థం అయింది. సుమిత్ర గుండె ప్రేమతో బరువెక్కింది.
అజయ్ తనకు నచ్చిన అమ్మాయిని ఇంకా అందరు మెచ్చేలా మార్చుకుని మరీ సుమిత్ర ను పెళ్లి చేసుకుని జీవితం అంతా ప్రేమించే లా ప్రేమను పంచేలా ప్రేమ కానుక ను అందివ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఒక వ్యక్తి లోని అన్ని గుణాలు మనకు నచ్చాలని లేదు.
"ప్రేమంటే ఎదుటి వ్యక్తి లోని బలహీనతలను కూడా ఒప్పుకోవడం.గౌరవించడం.వీలైతే వారిని ఆ బలహీనతల నుండి బయటపడేలా సహకారాన్ని స్నేహాన్ని అందించి తోడుగా నిలవడం"
ఎంతో సంతోషాలతో అజయ్ సుమిత్ర లో సంసార నౌక జీవిత సాగర పయనాన్ని మొదలుపెట్టింది
- డబుర ధనలక్ష్మి