ఒక గ్రామంలో రాముడూ, భీముడూ అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు.
భీముడు ఎప్పుడూ తాను కష్టపడి పనిచేసి పొట్టపోసు కునేవాడు. రాముడు పనిచేసేవాడు కాడు, తల్లి పెడితేతినేవాడు.
భీముడు రాముణ్ణి మందలించాడు.
దేవుడే అన్నం పెడతాడు అన్నాడు రాముడు..
కష్టపడనిదే దేవుడు కూడా అన్నంపెట్టడన్నాడు భీముడు.
దేవుడు తనకు అన్నం పెడతాడని రుజువు చెయ్యటానికి రాముఁడు ఒకరోజు భోజనం మాని కూర్చున్నాడు. భీముడు పక్కనే కూర్చున్నాడు.
కొద్దిసేపటికి నిజంగానే ఒక పళ్లెం అన్నంతో సరాసరి రాముడి ముందుకు వచ్చింది. వాడు దాన్నిఅందుకోబోయాడు. ఆది వెనక్కు జరిగింది. రాముడు లేచి దాన్ని పట్టుకోబోయాడు. అది వాణ్ణి నానా తిప్పలూ పెట్టింది.. రొప్పుతూ, చెమటలు దిగగారుతూ, రాముడు దాని వెంట పరిగెత్తి, ఎలాగోపట్టుకున్నాడు.
"ఏరా! చూసావా దేవుడిచ్చిన అన్నం కూడా అంత శ్రమపడితే గాని దక్కలేదు?” అన్నాడు భీముడు రాముడితో!
మొయినుద్దీన్