బాలానంద సంఘం వార్షిక సమావేశం : నూతన కార్యవర్గం

Advertisement
Update:2023-08-20 22:15 IST

రేడియో అన్నయ్య కీ.శే.న్యాయపతి రాఘవరావు రేడియో అక్కయ్య న్యాయపతి కామేశ్వరి 1940 ల్లో స్థాపించిన బాలానంద సంఘం 83 వ వార్షికసమావేశం.

ఆగస్టు 20 ఆదివారం ఉదయం హైద్రాబాద్ నారాయణ గూడా ఆంధ్ర బాలానంద సంఘం హాల్ లో జరిగింది . ఇటీవల కను మూసిన బాలానంద సంఘ అధ్యక్షులు ప్రముఖ లలితసంగీత వేత్త మహాభాష్యం చిత్తరంజన్ గారికి కార్యనిర్వాహకులు మలపాక పూర్ణ చంద్ర రావు గారికి నివాళి ఘటించారు .

బాలానంద సంఘ గత ఏడాది కార్యకలాపాలను శ్రీమతి జె.కామేశ్వరీ ప్రసాద్ (పాప )వివరించి భవిష్యత్ కార్యకలాపాలనువివరించారు . ఆర్థిక వ్యవహారాల పురోగతి గురించి సంఘం ట్రెజరర్ శ్రీ బి.వి.రామారావు వివరించారు .

2025 సంవత్సరానికి 85 సంవత్సరాల వేడుకను ఘనంగానిర్వహించుకోవాలని సభ్యులు అందరూ అభిప్రాయ పడ్డారు.



నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి .బాలానంద సంఘం నూతన అధ్యక్షులుగా శ్రీమతి జె.వి.కామేశ్వరి (పాప),ఉపాధ్యక్షులుగా ఆకాశవాణి పూర్వ కార్యక్రమ నిర్వహణాధికారి శ్రీ కలగా కృష్ణమోహన్ ,కార్యదర్శిగా శ్రీమతి డా.స్వర్ణబాల గంటి ,సహకార్యదర్శిగా ప్రముఖ కార్టూనిస్టు ,చిత్రకారులు సరసి (శ్రీ సరస్వతుల రామ నరసింహం), కోశాధికారిగా శ్రీ బి.వి.రామారావు

ఎన్నికయ్యారు .అలాగే కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది

కార్య నిర్వాహక కమిటీ సభ్యులు -

శ్రీ డా. టి. రాంబాబు

శ్రీ వి రవి కిరణ్

శ్రీమతి హరిణి

శ్రీమతి అరుణ నరేందర్

శ్రీమతి ఆర్ జానకి

శ్రీమతి ఎస్ దుర్గ

శ్రీమతి డా. హరిత

శ్రీమతి ఆర్ రాజేశ్వరి

శ్రీమతి సీతా సాయిరాం

శ్రీమతి అమృత మహభాష్యం

చివర ముగ్గురూ అనివార్య కారణాల వలన సమావేశంలో పాల్గొన లేక పోయారు. బాలానందం ట్రస్టు కార్యవర్గ నియామకాలు కూడా జరిగాయి .

ఈ ఏడాది నిర్వహించబోయే కార్యక్రమాలయిన గురు పూజా మహోత్సవం ,బతుకమ్మ వేడుకలు ,రంగవల్లి ,భోగి పళ్ళ వేడుక బాలల చిత్రకళా ప్రదర్శన ,వార్షికోత్సవ సభల గురించి అధ్యక్షులు వివరించి అందరి బాధ్యతలను విజయవంతంగా నిర్వహించుకోవడానికి ఉత్తేజ పరిచారు



సర్వసభ్య సమావేశానికి హాజరయిన బాలానందసంఘ సభ్యులు

అందరూ అనంతరం ఆనందంగా విందుభోజనం చేసారు.

Tags:    
Advertisement

Similar News