భావన : ఆశ్వీజ మాసాన అమ్మ పూజ

Advertisement
Update:2023-10-23 13:24 IST

శాస్త్ర విధి ప్రకారం మనిషి పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూత,మనుష్య, పితృ, దేవ, బ్రహ్మయజ్ఞాలు. సమస్త ప్రాణులకై కొంత అన్నం కేటాయించడం భూతయజ్ఞం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం. పితురులకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకర్మే పితృయజ్ఞం. హోమాదులు దేవయజ్ఞం సమాజానికిమార్గదర్శనం చేయటం అధ్యాపనబ్రహ్మయజ్ఞం.

ఈ ఐదు మహాయజ్ఞాలో పితృయజ్ఞానికే విశేష స్థానం ఉంది. ఈ నెల 14 న మహాలయ అమావాస్య .ఈ మహాలయ పక్షం సామూహిక పితృపూజలను చేయడానికి ఉద్దేశించబడింది. కొంతమది తమ తమ పితురుల తిథి సరిగా తెలియకపోతే కూడా వారి పేరుమీద అమావాస్యరోజున తర్పణం వదుల్తుంటారు. భాద్రపద బహుళపాడ్యమినుండి అమావాస్య వరకు పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది.

ఇక ఈ అశ్వీజ మాసంలో దేవతా పూజలకు అనువైనది కనుక అఖిలాండకోటినితన కన్ను సన్నులలో మెలగచేసే ఆదిపరాశక్తి వివిధ రూపాలలో అర్చించడం అనవాయితీగా వస్తోంది. శ్రీ దేవీ భాగవతము, శ్రీదేవీ సప్తశతి, మహావిద్యా, ఆదిశంకరుల సౌందర్యలహరి, త్రిపుర సుందరీ మానస పూజాస్తోత్రం, మంత్ర మాతృకాపుష్పమాలాస్తవం, లలితా సహస్రనామం వంటి గ్రంథాలన్నీ అమ్మను పూజించమని ఉద్ఘోషిస్తున్నాయి.

శరన్నవరాత్రులలో దుర్గాదేవి విగ్రహాన్ని యధాశక్తిగా బంగారం, వెండి లేదా మట్టితో చేసి పూజామందిరంలో ఉంచి, విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచారాలతో, సహస్ర నామాలతో, అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేసి నైవేద్యంపెడ్తారు. అమ్మవారి లీలను స్మరించుకుంటూ అమ్మవారికి ఇష్టమైన కార్యాలనేచేస్తుంటారు.

స్త్రీలు స్తనవృద్ధి గౌరీ వ్రతాన్ని పాటిస్తారు. తమ బిడ్డలసాభాగ్యాభివృద్ధికిగాను గౌరీదేవికి ఈ వ్రతాన్ని చేస్తారు. సప్తమినాడు సరస్వతి పూజ చేస్తారు. విద్యాభ్యాసాన్నికల్పించమని విద్యార్థులు. దుర్గమాలను దూరం చేయమని దుర్గాదేవి.మణిమాదిఅష్టసిద్ధులను నవనిధులను కలుగజేయమని మహిషాసుర మర్దిని,అన్నింటా విజయాలను కలుగజేయమని విజయలక్ష్మి ని శమీపూజను ఇలా అమ్మనుతమ తమకోరికలను అనుసరించి పూజిస్తుంటారు.

ఈ తొమ్మిదిరోజులు కుమారి

పూజను చేసి బాలాత్రిపురసుందరినీ పూజిస్తుంటారు. ఇలా తొమ్మిది రోజులు

దీక్షావ్రతం చేయలేని వారు సప్తమి, అష్టమి, నవమి తిధులలో దీక్ష పాటించి 'త్రిరాత్రవ్రతదీక్ష" అని చేస్తారు. ఇలా అమ్మను ఆరాధిస్తే సకల వ్యాధుల బారినుండి రక్షణదొరుకుతుంది. అమ్మను కొలిచినవారికి సంపూర్ణ ఆరోగ్యాదులు సమకూరుతాయి.

తనను నమ్మిన వారికి అమ్మ అపమృత్యువును పోగొడుతుంది. పరిపుష్టికరమైన ఆహారాన్నిస్తుంది. ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిస్తుంది. మనిషిలో అంతర్లీనంగా వున్న దైవీశక్తిని పెంపొందిస్తుంది. కనుక అమ్మపూజ ఆనందంగా ప్రతివారు చేస్తుంటారు. దుష్టులను దునుమాడి శిష్టులను, తననే నమ్మిన వారిని అక్కున చేర్చుకొనే అమ్మను వారు వీరు అనే భేదం లేకుండా సర్వులూ పూజించి వారి కోరికలను తీర్చుకుంటుంటారు. పైగా

అమ్మను తామరతూడులతో పూజిస్తే సకలసౌభాగ్యాలు పొందవచ్చని పుష్పచింతామణి చెబుతోంది.

- చోడిశెట్టి శ్రీనివాసరావు

Tags:    
Advertisement

Similar News