బహుగ్రంథకర్తగా, పలు అనువాద గ్రంథాల రచయితగా, విమర్శనాగ్రంథాల రచయితగా, విశ్వనాథ సత్యనారాయణ ముఖ్యశిష్యుల్లో ఒకరిగా పేరొందిన కళారత్నతుమ్మపూడి కోటేశ్వరరావు (89) గురువారంఉదయం బెంగుళూరులో కన్నుమూశారు.
1934ఫిబ్రవరి 10న గుంటూరు జిల్లా దుగ్గిరాలమండలం ఈమని గ్రామంలో ఓ మధ్యతరగతికుటుంబంలో జన్మించిన ఆయన విజయవాడలో బీఏ చదివే సమయంలో విశ్వనాథ సత్యనారాయణ ముఖ్య శిష్యుడిగా పేరొందారు. ఉస్మానియాయూనివర్సిటీలో ఎంఏ తెలుగుతోపాటు ఆముక్తమాల్యదలోపై తొలి పీహెచీ పూర్తి చేశారు. ఆయన రచనలలో ముఖ్యంగా సిద్ధాంత గ్రంథమైన ఆముక్తమాల్యద సౌందర్యం,మహాకావ్యంకుమారభారతి, లఘుకావ్యాలైన వంశీనికుంజం, చితాభస్మం, మాఅక్క ముఖ్యమైనవి. కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ఆచార్యుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కోటేశ్వరరావు కాళహస్తిలో శాఖాధ్యక్షుడిగా, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం,శ్రీకృష్ణదేవరాయవిశ్వవిద్యాలయంలోనూ పనిచేసి 1994లో ఉద్యోగ విరమణచేశారు.
30 పీహెచ్ డీ లకు ,20 ఎంఫిల్స్ పరిశోధనలకు మార్గదర్శనం చేశారు.
శాఖాధిపతిగా, సెనేట్ సిండికేట్ సభ్యుడిగా పని చేశారు. పాఠ్యప్రణాళిక అధ్యక్షుడిగా, మద్రాసు యూనివర్సిటీలో ఆచార్యుడిగా, 2002, 2003లలో వరంగల్ కాకతీయయూనివర్సిటీలోనూ, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలోనూ యూజీసీ ప్రొఫెసర్ గా పనిచేశారు. కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా వ్యవహరించారు. 2017లో విశ్వనాథ కల్పవృక్షం శాంతరసం పుస్తకాన్నిప్రచురించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ సలహాసంఘ సభ్యుడిగా, హైదరాబాద్ తెలుగు అకాడమీలో లైజన్ ప్రొఫెసర్ గా ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ కాన్ఫరెన్స్,తెలుగు విశ్వవిద్యాలయం పాలక సంఘ సభ్యుడిగా పనిచేశారు. టీటీడీ అన్నమాచార్యప్రాజెక్టు సంచాలకుడిగా, ఎర్రన హరివంశసోమవన ఉత్తర హరివంశంవ్యాఖ్యానాల రచయితగా,ఆంధ్రమహాభారతం అనుశాసనికపర్వం సంపాదకుడిగా నవనాధ చరిత్ర విస్తృత పరిశోధకుడిగానూఉన్నారు.వారి మృతి పట్ల సాహితీవేత్తలు నివాళి ఘటించారు