చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ కి దిమ్మతిరిగే కౌంటర్లు..

టిడ్కో ఇళ్ల వద్ద సిగ్గులేకుండా సెల్ఫీ దిగిన చంద్రబాబు.. వైసీపీ పూర్తి చేసిన నెల్లూరు, సంగం బ్యారేజ్ ల వద్ద కూడా నిలబడి సెల్ఫీ దిగాలని సూచించారు. కేవలం కమీషన్లకోసమే చంద్రబాబు టిడ్కో ఇళ్లు ప్రారంభించారన్నారు.

Advertisement
Update:2023-04-08 12:13 IST

Chandrababu Selfie: చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ కి దిమ్మతిరిగే కౌంటర్లు..

టిడ్కో ఇళ్ల వద్ద నిలబడి చంద్రబాబు నెల్లూరులో సెల్ఫీ దిగి, సోషల్ మీడియాలో సీఎం జగన్ కి ఛాలెంజ్ విసిరారు. "నేను అధికారంలో ఉండగా కట్టిన టిడ్కో ఇళ్లు ఇవి, నీ హయాంలో కట్టిన ఇళ్లు ఎక్కడ" అని జగన్ ని ప్రశ్నించారు. దీనికి వైపీసీ నుంచి దిమ్మతిరిగే రియాక్షన్లు వస్తున్నాయి. వైసీపీ మంత్రులు చంద్రబాబుకి వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు.

14 ఏళ్లలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశారో.. నాలుగేళ్లలో జగన్‌ ముఖ్యమంత్రిగా ఏం చేశారో చర్చిద్దామా? అని సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. ఏపీలో జగనన్న కట్టించిన కోటీ 50 లక్షల ఇళ్ల దగ్గరకు రావడానికి చంద్రబాబు సిద్దమా? అని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లను తానే కట్టానని చెప్పుకోవడానికి చంద్రబాబుకి సిగ్గులేదా అన్నారు మంత్రి జోగి రమేష్. జగనన్న కాలనీల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే లబ్ధిదారులకు 50వేల ఇళ్లు అందించామన్నారు. మిగతా ఇళ్లను కూడా త్వరలోనే అందిస్తామని చెప్పారు.

టిడ్కో ఇళ్ల పేరిట పేదల ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారని, అధికారికంగా టెండర్లు ఖరారు చేసి దోచుకున్నారని చెప్పారు. రుణమాఫీ చేస్తానని జనానికి పంగనామాలు పెట్టారని, కానీ తాము మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామని వివరించారు. సీఎం జగన్‌ ఏపీ ప్రజలకు చేసే మంచిని చూసి చంద్రబాబుకు మూర్ఛ వస్తోందన్నారు మంత్రి జోగి రమేష్.

సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ కనిపించలేదా..?

చంద్రబాబుకి నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ కనిపించలేదా అని ప్రశ్నించారు మరో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. టిడ్కో ఇళ్ల వద్ద సిగ్గులేకుండా సెల్ఫీ దిగిన చంద్రబాబు.. వైసీపీ పూర్తి చేసిన బ్యారేజ్ ల వద్ద కూడా నిలబడి సెల్ఫీ దిగాలని సూచించారు. కేవలం కమీషన్లకోసమే టిడ్కో ఇళ్లు ప్రారంభించారన్నారు. ఐదేళ్ల ఆయన హయాంలో ఆ ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు మంత్రి కాకాణి. జగన్ ను క్యాన్సర్ గడ్డ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. మనసులో విషం నింపుకొని ఉన్నారని మండిపడ్డారు. 

Tags:    
Advertisement

Similar News