బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిన వైసీపీ ఎంపీ

తాజాగా ఐప్యాక్ పేరుతో ఎల్లో మీడియా వైరల్ చేసిన ఓ సర్వే నిజమే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎల్లో మీడియాలో తమ పేరుతో వచ్చిన సర్వే రిపోర్టు ఫేక్ అని ఐప్యాక్ చెప్పిన విషయాన్ని ఎంపీ పట్టించుకోవటం లేదు. లేదు లేదు సోషల్ మీడియాలో వైరల్ అయిన‌ సర్వే ఐప్యాక్ చేయించిందే అని పదే పదే చెబుతున్నారు.

Advertisement
Update:2023-01-28 14:11 IST

అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. ఈయన బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది ఎవరికో తెలుసా? తెలుగుదేశం పార్టీ + జనసేనకు. ప్రతిరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కార్యక్రమాలకు మద్దతిస్తు, వాళ్ళ ఆరోపణలు, విమర్శలను ఎండార్స్ చేయటంతోనే రాజుగారి డైలీ షెడ్యూల్ బిజీగా ఉంటోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవాలని, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చోవాలని చంద్రబాబు, పవన్ ఎంతగా కోరుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగా రఘురామ‌రాజు కోరుకుంటున్నారు.

ఈ విషయాలు ప్రతి రోజు ఢిల్లీలో పెడుతున్న ప్రెస్ మీట్లలోనే బయటపడుతోంది. తాజాగా ఐప్యాక్ పేరుతో ఎల్లో మీడియా వైరల్ చేసిన ఓ సర్వే నిజమే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎల్లో మీడియాలో తమ పేరుతో వచ్చిన సర్వే రిపోర్టు ఫేక్ అని ఐప్యాక్ చెప్పిన విషయాన్ని ఎంపీ పట్టించుకోవటం లేదు. లేదు లేదు సోషల్ మీడియాలో వైరల్ అయిన‌ సర్వే ఐప్యాక్ చేయించిందే అని పదే పదే చెబుతున్నారు. వారాహి వాహనంలో పవన్ చేయబోతున్న యాత్ర, ఇప్పుడు లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్రతో వైసీపీకి ఘోర ఓటమి తప్పదని జోస్యం చెప్పేస్తున్నారు.

పవన్, లోకేష్ యాత్రలతో ప్రభుత్వం షేకైపోతోందన్నారు. మంత్రులంతా ఓడిపోవటం ఖాయమని తాను గతంలో చెప్పిన విషయాన్నే ఇప్పుడు ఐప్యాక్ సర్వే వివరాలు చెప్పాయంటున్నారు. పవన్, లోకేష్ యాత్రల ప్రభావం జనాలపైన విపరీతంగా పడుతుందని అంచనా వేశారు. ఇంకేముంది జగన్ పనైపోయింది ఎప్పుడు ఎన్నికలు పెట్టిని వైసీపీ ఇంటికి వెళ్ళటమే మిగిలుంది అంటున్నారు ఎంపీ.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 30 సీట్ల కన్నా వచ్చే అవకాశమే లేదట. అది కూడా పరిస్ధితులు ఇపుడున్నట్లు ఉంటేనే అంటున్నారు. ఎన్నికల నాటికి పరిస్ధితులు ఇంకా దిగజారితే ఇప్పుడు అనుకుంటున్న 30 సీట్లు కూడా రావని తేల్చేశారు. ఇవన్నీ గమనిస్తున్న జగన్ భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. జూలైలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. మళ్ళీ అధికారంలోకి రామని ఖాయంగా తెలిసినపుడు ఏ ముఖ్యమంత్రయినా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారన్న చిన్న లాజిక్‌ను రఘురాజు మిస్సవుతున్నారు. మొత్తానికి వైసీపీ తరపున గెలిచిన రఘురామ‌రాజు టీడీపీ, జనసేనకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు.

Tags:    
Advertisement

Similar News