`జగనన్నే మా భవిష్యత్తు`పైనే వైసీపీ ఆశలు
గృహసారధులే ఈ కార్యక్రమానికి రథసారధులై నడిపిస్తారు. ఆ తరువాత అనుబంధ విభాగాలు మిగిలిన పనిని పూర్తి చేస్తాయి. ప్రతీ ఇంటికి వెళ్లి ఐదుప్రశ్నలతో కూడా షీట్ ఇస్తారు.
నెలరోజుల క్రితం సిద్ధం చేసుకున్న వైసీపీ కార్యక్రమం ఏప్రిల్ 7 నుంచి లాంఛ్ కానుందని తెలుస్తోంది. ఇంటింటికీ వైసీపీ కనెక్ట్ అయ్యే విధంగా రూపొందించిన ఈ కార్యక్రమానికి ``జగనన్నే మా భవిష్యత్తు`` అని నామకరణం గతంలోనే చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంతో ఇది వాయిదా పడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచిన ఆనందంలో ఉన్న టీడీపీ ఓవర్ గా రియాక్ట్ అవుతోంది. జగన్ పని అయిపోయింది అనే లైన్‌తో సోషల్ మీడియా క్యాంపెయిన్ ఆరంభించేసింది.
అదును చూసి పంజా విసిరేందుకు వైసీపీ సిద్ధం అవుతోంది. ఫిబ్రవరిలో అంతా సిద్ధం అయిపోయిన ‘‘జగనన్నే మా భవిష్యత్తు’’ క్యాంపెయిన్‌ని రీ షెడ్యూల్ చేసి ఏప్రిల్ 7న ప్రారంభించనున్నారని సమాచారం. రాష్ట్రంలో కుల, మత, ప్రాంత, పేద, ధనిక, పార్టీ భేదం లేకుండా ప్రతీ ఒక్క ఇంటికి కనెక్ట్ అయ్యేలా రూపొందించిన ఈ కార్యక్రమంపై వైసీపీ బోలెడన్ని ఆశలు పెట్టుకుంది.
గృహసారధులే ఈ కార్యక్రమానికి రథసారధులై నడిపిస్తారు. ఆ తరువాత అనుబంధ విభాగాలు మిగిలిన పనిని పూర్తి చేస్తాయి. ప్రతీ ఇంటికి వెళ్లి ఐదుప్రశ్నలతో కూడా షీట్ ఇస్తారు. వారు నిర్భయంగా వారి అభిప్రాయాలు, సమస్యలు తెలియజేస్తారు. సంతృప్తి వ్యక్తం చేసినవారు, అసంతృప్తి వ్యక్తం చేసిన వారిగా విభజిస్తారు. అసంతృప్తుల సమస్యలేంటో మలివిడత టచ్ చేస్తారు. ఇందులో మిస్ట్ కాల్ క్యాంపెయిన్ కూడా ఉంది. ప్రతీ నియోజకవర్గంలో ప్రతీ ఇంటి అభిప్రాయం ఎమ్మెల్యే వరకూ చేరుతుంది.
‘‘జగనన్నే మా భవిష్యత్తు’’ కార్యక్రమం ఎంత పకడ్బందీగా నిర్వహించగలిగితే అంత వైసీపీకి మేలు అని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీలో అన్ని విభాగాలు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయని సమాచారం. ఈ కార్యక్రమం కోసం ముందుగా సోషల్ మీడియాని సంసిద్ధం చేస్తున్నారు.