తిరగబడిన మహాసేన రాజేశ్‌... ‘నాకిదేం టార్చర్‌’

మహాసేన రాజేశ్‌ను పోటీ నుంచి తప్పించినట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ స్థితిలో మహాసేన రాజేశ్‌ తీవ్రంగా మండిపడ్డారు. నాకిదేమి టార్చర్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Update:2024-03-18 12:35 IST

మహాసేన రాజేశ్‌కు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పి.గన్నవరం సీటును కేటాయించిన విషయం తెలిసిందే. ఆయన అభ్యర్థిత్వంపై జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఆందోళనకు కూడా దిగారు. ఈ పరిస్థితిలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. మహాసేన రాజేశ్‌ పోటీ నుంచి తప్పుకున్నారనే ఉద్దేశంతో ఆ సీటును జనసేనకు కేటాయించారు. అయితే, మహాసేన రాజేశ్‌ను పోటీ నుంచి తప్పించినట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ స్థితిలో మహాసేన రాజేశ్‌ తీవ్రంగా మండిపడ్డారు. నాకిదేమి టార్చర్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోటీ నుంచి తప్పుకోవాలని తనకు చంద్రబాబు సూచించలేదని రాజేశ్‌ అన్నారు. ఇప్పుడు జనసేన పోటీ చేస్తున్నట్లు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ పేరుతో సర్వేలు చేస్తున్నారని, ఇది తనను అవమానించడమేనని ఆయన అన్నారు. తనకు సీటు కేటాయించని వరకు 15 రోజులు ప్రశాంతంగా ఉన్నానని, ఇప్పుడు తనను వేదనకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.

పి. గన్నవరంలో తాను ఇన్‌చార్జ్‌గా ఉన్నానని ఆయన చెప్పారు. నీకు సీటు లేదు, పక్కన ఉండు అని చంద్రబాబు చెప్పే వరకు వేచి చూడాలి కదా అని ఆయన అంటున్నారు. ఇందుకు సంబంధించిన మహాసేన రాజేశ్‌ తాజా వీడియో వైరల్‌ అవుతోంది. ఇది జనసేనకు తీవ్రమైన నష్టం చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News