సీఎం జగన్‌పై రేణుకా చౌదరి అనుచిత వ్యాఖ్యలు

అమరావతి వాదులు ఏ క్షణం పిలిచినా సరే వచ్చి వారికి అండగా ఉంటానన్నారు. సుప్రీంకోర్టు చెప్పినా జగన్ వినడం లేదని.. దున్నపోతుపై వర్షం పడినట్టుగా పరిస్థితి తయారైందన్నారు. ఈ హీనమైన వ్యక్తి వచ్చాక రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు.

Advertisement
Update:2023-03-01 19:06 IST

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం అవకాశం ఇస్తే విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. జగన్‌ వైఎస్ఆర్‌ ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పిచ్చోడి చేతిలో రాయిలా జగన్‌ చేతిలో ఏపీ ఉందన్నారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతోందన్నారు.

ఇంత జరుగుతుంటే సుప్రీంకోర్టు ఎందుకు జగన్‌ విషయంలో స్పందించడం లేదని ప్రశ్నించారు. జగన్ గతంలోనూ ఇలాంటి పిచ్చి వేషాలు వేసేవాడని.. కానీ, అవి బయటకు రాకుండా వైఎస్ఆర్‌ కవర్ చేసేవాడన్నారు. చట్టాలు చెప్పే దాన్ని సీఎం పాటించనప్పుడు.. ముఖ్యమంత్రి చెప్పే దాన్ని తామెందుకు పాటించాలని ఆమె ప్రశ్నించారు.

అమరావతి వాదులు ఏ క్షణం పిలిచినా సరే వచ్చి వారికి అండగా ఉంటానన్నారు. సుప్రీంకోర్టు చెప్పినా జగన్ వినడం లేదని.. దున్నపోతుపై వర్షం పడినట్టుగా పరిస్థితి తయారైందన్నారు. ఈ హీనమైన వ్యక్తి వచ్చాక రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు.

అయితే పక్క రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు పదేపదే ఏపీకి రావడం ఇక్కడ అంశాలపై మాట్లాడటం, సీఎంను తిట్టడం, విజయవాడ నుంచి పోటీ చేస్తా అనడం చర్చనీయాంశంగా ఉంది. కేవలం కులాభిమానంతోనే ఆమె ఇలా సొంత రాష్ట్రంలో పార్టీని వదిలేసి పక్క రాష్ట్రంలోని అంశాలపై స్పందిస్తున్నారన్న విమర్శ కూడా ఉంది.

Tags:    
Advertisement

Similar News