ఏపీలో ఎగ్‌పఫ్‌ ఇష్యూ.. టీడీపీకి వైసీపీ సవాల్‌!

ఇది జర్నలిజమా, బ్రోకరిజమా.. దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలంటూ సవాల్ చేసింది వైసీపీ. లేదంటే తప్పుడు ప్రచారం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

Advertisement
Update:2024-08-21 10:58 IST

ఏపీలో ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య డైలాగ్‌ వార్ కంటిన్యూ అవుతోంది. ఇది ఏ సీరియస్‌ ఇష్యూ గురించో అనుకుంటే పొరపాటే. నేతల స్నాక్స్‌ ఖర్చుపై రెండు పార్టీల మధ్య ఇప్పుడు ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ప్రధానంగా ఎగ్‌పఫ్‌ల చుట్టే ఇప్పుడు చర్చ అంతా నడుస్తోంది.

ఇంతకీ వివాదం ఏంటి అంటే!

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కేవలం ఎగ్‌పఫ్‌ల కోసమే రూ.3 కోట్ల 60 లక్షలకు పైగా ఖర్చు పెట్టిందంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. సగటున ఏడాదికి కేవలం ఎగ్‌పఫ్‌ల కోసమే జగన్‌ ప్రభుత్వం రూ. 72 లక్షలు ఖర్చు చేసిందని, రోజుకు దాదాపు 993 ఎగ్‌పఫ్‌లు, ఐదేళ్లలో మొత్తం 18 లక్షల ఎగ్‌పఫ్‌లు తిన్నట్లు లెక్కలు చూపించారంటూ టీడీపీ అనుకూల సోషల్‌మీడియా పేజీలు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరపనుందన్న చర్చ జరుగుతోంది.


అయితే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టిన వైసీపీ.. అధికార టీడీపీకి స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది. ఎగ్‌పఫ్‌ల ఖర్చుపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన వైసీపీ.. ఇంత దిగజారుడు తనమా అంటూ ప్రశ్నించింది. ఎంగిలి బిస్కెట్లకు ఆశపడి పనికి మాలిన ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల సోషల్‌మీడియా, మీడియా పేజీలపై ఫైర్ అయింది. ఇది జర్నలిజమా, బ్రోకరిజమా.. దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలంటూ సవాల్ చేసింది వైసీపీ. లేదంటే తప్పుడు ప్రచారం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. 2014 -19 మధ్య కాలంలో చంద్రబాబు, లోకేష్‌ కేవలం స్నాక్స్ కోసమే దాదాపు రూ.8 కోట్ల 50 లక్షలు నాకేశారని, ఇప్పుడు మళ్లీ అదే తరహాలో చేసేందుకు సిద్ధమయ్యారంటూ ఆరోపించింది వైసీపీ.

Tags:    
Advertisement

Similar News