'స్కిల్ డెవలప్‌మెంట్' అతిపెద్ద స్కామ్ - సజ్జల

స్కిల్ డెవలప్‌‌మెంట్ కార్పోరేషన్ స్కాంలో చంద్రబాబు, లోకేష్ పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కాం జ‌రిగే అవ‌కాశ‌మే లేదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ స‌లహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆరోపించారు. . ఈ వ్యవహారంలో పాత్ర ఉంద‌ని తేలితే ఎంత‌టివారిపైనైనా త‌ప్ప‌క చ‌ర్య‌లు ఉంటాయ‌ని స‌జ్జ‌ల చెప్పారు.

Advertisement
Update:2022-12-05 15:19 IST

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తెలుగుదేశం హ‌యాంలో జ‌రిగిన అనేక కుంభ‌కోణాల‌లో పోల‌వ‌రం, స్కిల్ డెవ‌లెప్ మెంట్ కార్పోరేష‌న్‌, రాజ‌ధానికి భూ సేక‌ర‌ణ వంటివి ప్ర‌ధాన‌మైన‌వ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వ స‌లహాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆరోపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పోరేష‌న్ లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని, ఈ వ్య‌వ‌హారంలో రాజ‌కీయ జోక్యం తోనే ఇంత పెద్ద స్కామ్ జ‌రిగింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని.. త్వరలోనే అన్ని విషయాలు బ‌య‌టికి వస్తాయని అన్నారు. అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన స‌మ‌యంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్రబాబుకు తెలియకుండానే ఇంతా భారీ స్కామ్ జరుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌‌మెంట్ కార్పోరేషన్ స్కాంలో చంద్రబాబు, లోకేష్ పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కాం జ‌రిగే అవ‌కాశ‌మే లేద‌న్నారు. ఈ వ్యవహారంలో పాత్ర ఉంద‌ని తేలితే ఎంత‌టివారిపైనైనా త‌ప్ప‌క చ‌ర్య‌లు ఉంటాయ‌ని స‌జ్జ‌ల చెప్పారు.

చంద్రబాబు పోలవరంప్రాజెక్ట్ ను ఏటీఎంగా మార్చుకున్నారని, ప్రాజెక్టు స‌కాలంలో పూర్తి కాపోవ‌డానికి కార‌ణం చంద్రబాబే అని విమర్శించారు. కాపర్ డ్యామ్, స్పిల్‌ వేల నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తిక్కపని వల్ల డ్యామేజ్ అంచనా వేయడానికే సమయం పడుతుందని చెప్పారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదు.. పోలవరం పూర్తిచేసేది లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ హయాంలోనే పోలవరం పూర్తి చేస్తామ‌ని అన్నారు.

రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించే ఆలోచ‌న ఏదీ లేద‌ని, ఈ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నామనే ప్రచారం అవాస్తవం అని చెప్పారు. సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. న్యాయ పరిశీలన చేసి పకడ్బందీగా మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ప్రవేశపెడతామని స‌జ్జ‌ల చెప్పారు

Tags:    
Advertisement

Similar News