కాంగ్రెస్‌లో చేరిన షర్మిల మాకు రాజకీయ ప్రత్యర్థే

షర్మిలకు ఏపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే షర్మిల వైసీపీకి పోటీగా పనిచేయాల్సి ఉంటుంది.

Advertisement
Update:2024-01-04 20:52 IST

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొత్త పార్టీలు ఆవిర్భవించడంతో పాటు టికెట్ దక్కదనుకునే నాయకులు పార్టీలు మారుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అనంతరం షర్మిల తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

షర్మిలకు ఏపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే షర్మిల వైసీపీకి పోటీగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై స్పందించారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీ అయినా తమకు ఒక్కటేనని చెప్పారు. షర్మిలను తమ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్నారు.

కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియాగాంధీ, చంద్రబాబుది అని చెప్పారు. తామంతా ముఖ్యమంత్రి జగన్ కోసమే పని చేస్తామన్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఎన్ని పార్టీలు వచ్చినా, మళ్లీ జగన్ ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News