మరీ అంతలా కష్టపెట్టకండి.. కందిపోతాడేమో.. లోకేశ్ యాత్రపై సోషల్ మీడియాలో సెటైర్లు

లోకేశ్ లీడర్ గా ఎదగాలంటే ఈ పాదయాత్రే కీలకమని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఒకవేళ పాదయాత్ర‌ ఫెయిల్ అయితే లోకేశ్ ఇక రాజకీయాలకు అన్ ఫీట్ అనే టాక్ కూడా వస్తుంది.

Advertisement
Update:2022-12-03 16:30 IST

టీడీపీ యువనేత నారా లోకేశ్ త్వరలో ఏపీలో పాదయాత్ర చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ ఓ రేంజ్ లో హడావుడి చేస్తోంది. పాటల షూటింగ్‌లు.. సోషల్ మీడియాలో పోస్టులతో తెగ హడావుడి చేస్తోంది. అయితే ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర విషయంలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. నారా లోకేశ్ కు పాదయాత్ర కోసం ట్రైనింగ్ ఇచ్చేందుకు ముంబై నుంచి ప్రత్యేకంగా ఓ ఫిట్ నెస్ ట్రైనర్ వచ్చారట. ఆయన పాదయాత్రలో భాగంగా రోజుకు ముప్పై కిలోమీటర్లు నడవాలి కాబట్టి.. అందుకోసం ప్రస్తుతం ట్రెడ్ మిల్ మీద నడిపిస్తూ ట్రైనింగ్ ఇస్తున్నారట.

అంతేకాక జనంలో ఎలా మాట్లాడాలి.. వారిని ఎలా ఓదార్చాలి. వారిని ఏయే ప్రశ్నలు అడగాలి.. తదితర విషయాలపై మరికొందరు ఆయనకు శిక్షణ ఇస్తున్నారట. ఇదంతా తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ నేతృత్వంలో సాగుతోంది. నిజానికి నారా లోకేశ్ నేరుగా యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకు ప్రజలతో మమేకం అవ్వడం పెద్దగా తెలియదు. జనంలోకి చొచ్చుకొని వెళ్లలేరు. అంతేకాక ఇప్పటి పరిస్థితి ఏమిటో తెలియదు గానీ.. ఓరల్ స్కిల్స్ చాలా తక్కువగా ఉండేవి. ఏ విషయం మీద కూడా పూర్తిగా కసరత్తు చేయకుండానే జనంలోకి వెళ్లేవారేమో తెలియదు గానీ.. నిత్యం ట్రోలింగ్ కు గురయ్యేవారు.

ఈ క్రమంలో చాలా రోజులపాటు కేవలం ట్విట్టర్ కే పరిమితమయ్యారు. ట్వీట్లు చేసుకుంటూ కాలం గడిపేశారు. ఇలాగే ఉంటే యువనేతగా ఎదగడం కష్టమని భావించారేమో.. ప్రస్తుతం జనంలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి పాదయాత్ర సక్సెస్ కావాలంటే మాటలు కాదు.. కచ్చితంగా విషయ పరిజ్ఞానం ఉండాలి. ఆయా నియోజకవర్గాల సమస్యల మీద పట్టు ఉండాలి. జనంతో మమేకమయ్యే విధానం తెలిసి ఉండాలి. అప్పుడే వారిని ఆకట్టుకోవచ్చు. కానీ లోకేశ్ కు ఈ విషయంలో ఎంత మేర పరిజ్ఞానం ఉందో తెలియదు. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు భయపడుతున్నారట.

లోకేశ్ లీడర్ గా ఎదగాలంటే ఈ పాదయాత్రే కీలకమని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఒకవేళ పాదయాత్ర‌ ఫెయిల్ అయితే లోకేశ్ ఇక రాజకీయాలకు అన్ ఫీట్ అనే టాక్ కూడా వస్తుంది. కాబట్టి.. మీడియా, సోషల్ మీడియాను వాడుకొని ట్రోలింగ్ ను తట్టుకొని లోకేశ్ ను గట్టిగా రంగంలోకి దించేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. లోకేశ్ పాదయాత్ర చేసే సమయంలో ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలో కూడా యువనేతతో ప్రాక్టీస్ చేయిస్తున్నారట.

ఇక పాదయాత్ర చేసే సమయంలో నారా లోకేశ్ ను మోసేందుకు ఎలాగూ పచ్చ మీడియా సిద్ధంగానే ఉంది. అయితే కేవలం ఆ రెండు పత్రికలను, కొన్ని చానళ్లును మాత్రమే చంద్రబాబు నమ్ముకోవడం లేదట. ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా ను కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మరి లోకేశ్ పాదయాత్ర సక్సెస్ అవుతుందో..? ఫెయిల్ అవుతుందో..? వేచి చూడాలి. అయితే లోకేశ్ ను ట్రేడ్ మిల్ పై గంటలు గంటలు నడిపిస్తుండటంతో పాపం బాబు కందిపోతాడేమో జాగ్రత్త అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News