టికెట్‌ అడగడం లేదంటే.. అది చెల్లని పార్టీ అని అర్థం..

ఒకవేళ ఎవరూ టికెట్‌ అడగడం లేదంటే అది చెల్లని పార్టీ అని, ఎత్తిపోయిన పార్టీ అని అర్థమని సజ్జల తెలిపారు. ఏదైనా పార్టీలో సీట్లు అడిగేవారే లేరంటే.. దాని అర్థం ఏమిటో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు.

Advertisement
Update:2023-12-27 16:29 IST

వైసీపీలో అసంతృప్తులు పెరుగుతున్నారనే వాదనలపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సీట్ల మార్పులు, పార్టీలో అంసతృప్తుల అంశంపై బుధవారం ఆయన తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మంచి చేసిన పార్టీ, పాలనను ప్రజల ముంగిట్లోకి తెచ్చిన పార్టీ వైసీపీ అని సజ్జల చెప్పారు. అందుకే ప్రజల్లో తమ పార్టీ పట్ల నమ్మకం ఉందన్నారు. ప్రజల్లో వైసీపీకి అత్యంత ఆదరణ ఉంది, పార్టీ బలంగా ఉంది కాబట్టే.. వైసీపీలో సీటును ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. సీటు ఆశిస్తున్న నాయకులు ఎక్కువ మంది ఉన్నప్పుడు అసంతృప్తులు ఉండటం కూడా సహజమేనని చెప్పారు. అందరితో మాట్లాడి ఒక తాటిపైకి తీసుకొస్తామని ఆయన స్పష్టంచేశారు.

ఒకవేళ ఎవరూ టికెట్‌ అడగడం లేదంటే అది చెల్లని పార్టీ అని, ఎత్తిపోయిన పార్టీ అని అర్థమని సజ్జల తెలిపారు. ఏదైనా పార్టీలో సీట్లు అడిగేవారే లేరంటే.. దాని అర్థం ఏమిటో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. తమ పార్టీ ప్రజలకు మంచి పరిపాలన అందించింది కాబట్టే.. ప్రజల్లో బలంగా ఉందని, అందుకే తమ పార్టీలో సీట్లు ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని వివరించారు. తమ పార్టీ తరఫున ఎవరికి సీటు ఖరారు చేసినప్పటికీ మిగిలిన నాయకులందరూ కలిసి ఆ అభ్యర్థిని, పార్టీని గెలిపించుకొనేందుకు ఉమ్మడిగా కృషిచేస్తారని సజ్జల తెలిపారు.

Tags:    
Advertisement

Similar News