'కొత్త సంవత్సరం ఆరంభంనుంచే విశాఖ నుంచి పాలన'
ప్రజలకు మేలు జరుగుతుంటే విపక్షాలు అక్కసుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని వైసీపీ రీజినల్ కో ఆర్ఢినేటర్, టీటీడీ చైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. పాలన వికేంద్రీకరణపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త సంవత్సరం ఆరంభంలోనే విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పాలన ప్రారంభం వుతుందని వైసీపీ రీజినల్ కో ఆర్ఢినేటర్, టీటీడీ చైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి చెప్పారు. కొత్త సంవత్సరం ఆరంభంలో విశాఖ నుంచి పాలన సాగించే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా యోచిస్తున్నారని తెలిపారు. ఇందుకు న్యాయపరమైన ఇబ్బందులన్నీ త్వరలోనే తొలగిపోతాయని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయం.. పార్టీ రాష్ట్ర కార్యాలయంగా మారనుందని అన్నారు.
బుధవారంనాడు సుబ్బారెడ్డి విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీ కారం చుట్టారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ది చేయాలని సీఎం జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా తీసుకురావాలని నిర్ణయించారని చెప్పారు.
ప్రజలకు మేలు జరుగుతుంటే విపక్షాలు అక్కసుతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. పాలన వికేంద్రీకరణపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. దేశంలో ఎక్కడ అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు, బలహీన వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు.