ఆరోపణలకు సమాధానాలు లేవు.. మళ్లీ అదే పాత కథ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో వస్తున్న వార్తలు, కథనాల వల్లే ప్రభుత్వం కక్షకట్టిందట. ఈనాడును ఏమీచేయలేక మార్గదర్శిని టార్గెట్ చేస్తుంద‌ని ఆరోపించారు. మొత్తం కథనం చదివితే రామోజీలోని భయం స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Update:2023-06-18 11:02 IST

ఈ రోజు ఎల్లో మీడియాలో బ్యానర్ కథనం చూస్తే మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా కలరింగ్ ఇచ్చుకున్నారు. ‘ఈనాడు’పై కక్షతోనే మార్గదర్శిపై చర్యలు అనే హెడ్డింగ్‌తో పెద్ద స్టోరీ అచ్చేశారు. దాన్ని చదివిన పాఠకులు ఏమనుకుంటారంటే కోర్టు కేసులో ప్రభుత్వాన్ని జడ్జి తప్పుపడుతూ యాజమాన్యానికి అనుకూలంగా తీర్పిచ్చారేమో అన్నట్లుగా ఉంది. కానీ లోపల చూస్తే అంతా ప్రభుత్వంపై మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు ఆరోపణలే తప్ప ఇంకేమీకాదు.

మొత్తం కథనం చదివితే రామోజీలోని భయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో వస్తున్న వార్తలు, కథనాల వల్లే ప్రభుత్వం కక్షకట్టిందట. ఈనాడును ఏమీచేయలేక మార్గదర్శిని టార్గెట్ చేస్తుంద‌ని ఆరోపించారు. 60 ఏళ్ళుగా మార్గదర్శిని ఎలాంటి ఆరోపణలు, మచ్చా లేకుండా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిట్ ఫండ్ నిబంధనల ప్రకారమే తాము సంస్థ‌ను నిర్వహిస్తున్నా, ఆస్తుల జప్తు పేరుతో ప్రభుత్వం చందాదారుల్లో భయాన్ని సృష్టిస్తోందంటు రెచ్చిపోయారు.

ఖాతాదారుల సొమ్మును తాము ఇతర మార్గాల్లోకి మళ్ళించలేదని, సంస్థ‌కు వచ్చిన ఆదాయానికి మరికొంత కలిపి మాత్రమే పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణ ఏమిటంటే రామోజీ అసలు మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ‌ను ప్రారంభించటమే తప్పని. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం ప్రారంభించినట్లు పదేపదే చెబుతున్నారు. హిందు అవిభాజ్య కుటుంబం(హెచ్‌యుఎఫ్) పద్దతిలో మార్గదర్శి వ్యాపారం ప్రారంభించినట్లు కొన్నిచోట్ల చూపారట. దీని ప్రకారమైతే కుటంబ సభ్యుల నుండి తప్ప బయటవాళ్ళదగ్గర పెట్టుబడులు తీసుకోకూడదని ఉండవల్లి అంటున్నారు. కానీ రామోజీ ప్రజల నుండే పెట్టుబడులు సేకరించారట.

పోనీ కంపెనీ లా చట్టం ప్రకారమే వ్యాపారం చేస్తున్నారంటే అసలు కంపెనీ లా చట్టం ప్రకారం చిట్‌ఫండ్ వ్యాపారమే చేయకూడదని ఉండవల్లి చెబుతున్నారు. తాజా కథనంలో ఈ విషయాలపై క్లారిటి ఇవ్వకుండా ఏదేదో సోదంతా చెప్పుకున్నారు. కంపెనీకి ఉన్న ఘన చరిత్ర, ఖాతాదారుల విశ్వసనీయత, తిరిగి చెల్లించే సామర్ధ్యం లాంటవన్నీ చెప్పుకున్నారు. ఖాతాదారుల సొమ్ము సుమారు వెయ్యి కోట్ల రూపాయలను చిట్టేతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టటం తప్పన్న విషయాన్ని మాత్రం చెప్పరు. మొత్తానికి తాజా కథనంలో రామోజీలోని భయం స్పష్టంగా బయటపడింది.

Tags:    
Advertisement

Similar News