వృక్ష విలాపం.. మళ్లీ మొదలు పెట్టిన పవన్

ఏపీ సీఎం జగన్ పర్యటనలో చెట్లను నరికివేసే అపూర్వ ప్రక్రియ అంటూ వెటకారంగా ట్వీట్ మొదలు పెట్టిన పవన్ కల్యాణ్.. అమలాపురంలో తాజాగా సీఎం పర్యటనకోసం నేలకొరిగిన చెట్ల ఫొటోలను ట్వీట్ లో ఉంచారు.

Advertisement
Update:2023-07-24 15:25 IST

వాలంటీర్ల విషయంలో ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్ ఇటీవల విద్యా వ్యవస్థపై హాట్ కామెంట్లు మొదలు పెట్టారు. బైజూస్ ఒప్పందాన్ని టార్గెట్ చేసుకుని వరుస ట్వీట్లు వేశారు. తాజాగా సీఎం జగన్ పర్యటనలపై కౌంటర్లు మొదలు పెట్టారు. పుష్ప విలాపంలోని కవితను ట్వీట్ చేస్తూ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఏపీలో వృక్ష విలాపం మొదలైందన్నారు పవన్.


ఏపీ సీఎం జగన్ పర్యటనలో చెట్లను నరికివేసే అపూర్వ ప్రక్రియ అంటూ వెటకారంగా ట్వీట్ మొదలు పెట్టిన పవన్ కల్యాణ్.. అమలాపురంలో తాజాగా సీఎం పర్యటనకోసం నేలకొరిగిన చెట్ల ఫొటోలను ట్వీట్ లో ఉంచారు. కనీసం సీఎం జగన్ కి తెలియకపోయినా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా చెట్ల నరికివేతను ఆపాల్సిందని చెప్పారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన పుష్పవిలాపం చదవకపోతే, జగదీష్ చంద్రబోస్ ప్రయోగాలు మీకు అర్థం కాకపోతే.. పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు పవన్.

సీఎం జగన్ పర్యటనకు వస్తున్నారంటే.. అక్కడ రహదారి కి ఇరువైపులా ఉన్న చెట్లను భద్రతా కారణాల దృష్ట్యా కొట్టేస్తున్నారు. ఇటీవల చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. వీటిని హైలెట్ చేస్తూ టీడీపీ అనుకూల మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల తర్వాత ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఈ విషయాన్నే హైలెట్ చేస్తూ ట్వీట్లు వేశారు. వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి.. అంటూ సెటైర్లు పేల్చారు. 

Tags:    
Advertisement

Similar News