ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు
రూ. 1,87,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
Advertisement
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు సిద్ధపడింది. రూ. 1,87,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. దీనిద్వారా వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ. 20,620 కోట్ల ఆదాయం రానున్నది. 1.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు NGEL - NREDCAP మధ్య సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, గొట్టిపాటి రవి సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో సత్ఫలితాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Advertisement