Nandamuri Balakrishna: బాలయ్య మూడో‘సారీ’.. ఈసారి నర్సులకు

Balakrishna responds to comments on nurses: బాలయ్య నోరు జారడం మాత్రం అన్ స్టాపబుల్ అంటున్నారు ఆయన గురించి తెలిసినవారు. అందుకే ఆయన సారీలు చెప్పే సందర్భాలు కూడా అన్ స్టాపబుల్ గానే ఉంటాయనుకోవాలేమో.

Advertisement
Update:2023-02-06 13:56 IST

నోరు జారడం, సారీ చెప్పడం.. బాలకృష్ణకు ఇటీవల బాగా అలవాటైపోయింది. ఆమధ్య దేవాంగ కులస్తుల నాయకుడు రావణ బ్రహ్మ అంటూ నోరుజారి ఆ తర్వాత వారికి బహిరంగ క్షమాపణలు చెప్పారు బాలకృష్ణ. ఆ తర్వాత వీరసింహారెడ్డి ఫంక్షన్లో.. అక్కినేని-తొక్కినేని వివాదం అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అభిమానులు రచ్చ చేసిన తర్వాత క్షమాపణ చెప్పీ చెప్పకుండా ఆ వివాదానికి ముగింపు పలికారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బాలయ్య సారీ చెప్పేశారు. ఈసారు నర్సులను ఆయన క్షమాపణలు అడిగారు.

“అందరికీ నమస్కారం,

నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ...

నా మాటలను కావాలనే వక్రీకరించారు.

రోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎంతగానో సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ...

మీ నందమూరి బాలకృష్ణ”

అంటూ క్షమాపణలు చెబుతున్న మేటర్ ని బాలకృష్ణ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.


Full View


పవన్ కల్యాణ్ తో చేసిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో తనకు చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ ని గుర్తు చేసుకుని నర్సుల అందాన్ని పొగిడారు బాలకృష్ణ. అయితే ఆ పొగడ్త కాస్త శృతిమించింది. అందులో ఓ బూతుపదం దొర్లింది. దీంతో ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన బాలయ్య వ్యాఖ్యలను కొంతమంది నర్సులు ఖండించారు. నర్సింగ్ సంఘాలు బాలయ్య క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశాయి. ఎట్టకేలకు బాలకృష్ణ బయటకొచ్చారు. సారీ చెప్పారు.

అయితే ఇక్కడితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడినా బాలయ్య నోరు జారడం మాత్రం అన్ స్టాపబుల్ అంటున్నారు ఆయన గురించి తెలిసినవారు. అందుకే ఆయన సారీలు చెప్పే సందర్భాలు కూడా అన్ స్టాపబుల్ గానే ఉంటాయనుకోవాలేమో.

Tags:    
Advertisement

Similar News