వైసీపీకి పోతుల సునీత రాజీనామా.. అదే బాటలో మోపిదేవి, బీద!
2023లో పదవీకాలం ముగియడంతో.. సునీతను మరోసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు జగన్. ప్రస్తుతం 2029 మార్చి వరకు పదవీకాలం ఉంది.
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవల ఆళ్ల నాని పార్టీని వీడిన విషయం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.
2017లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పోతుల సునీత.. 2020లో ఆ పార్టీకి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2021లో వైసీపీ తరపున ఎమ్మెల్సీగా తిరిగి ఎన్నికయ్యారు. 2023లో పదవీకాలం ముగియడంతో.. సునీతను మరోసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు జగన్. ప్రస్తుతం 2029 మార్చి వరకు పదవీకాలం ఉంది.
ఇక రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు సైతం వైసీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ త్వరలోనే అనుచరులతో సమావేశమైన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.