ఎగిరి పడుతున్న నారా లోకేష్.. ఆ సర్వేకు అంత సీన్ లేదు గురూ..
2019 ఎన్నికల్లో టీడీపీకి 14 లోక్‌సభ స్థానాలు వస్తాయని, 90 నుంచి 100 శాసనసభ స్థానాలు సాధిస్తుందని సీ ` ఓటర్ అభిప్రాయపడింది. చివరకు ఫలితాలు ఏ రకంగా వచ్చాయో అందరికీ తెలుసు.
ఇండియా టుడే` సీ ఓటర్ సర్వే ఫలితాలు చూసి టీడీపీ అధ్కక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఎగిరి గంతేశారు. చూశావా, మేం గెలిస్తున్నామంటూ ఊగిపోయారు. అయితే, ఆ సర్వేకు ఉన్న విశ్వసనీయత ఎంత అనేది ఏశ్న. ట్రాక్ రికార్డు చూస్తే దానికి అంత సీన్ లేదనేది స్పష్టమవుతుంది. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరు మీద ఇండియా టుడే సీ ఓటర్‌తో కలిసి చేసిన సర్వే అది. నిజానికి, ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటూ వస్తున్నాయి. అయితే, ఆ సర్వేలను ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియాతో కలిసి చేసినవి.
ఆ విషయం తెలుసు కాబట్టే ఆంధ్రజ్యోతి చాలా తెలివిగా వ్యవహరించింది. సీ ఓటర్‌ను ప్రస్తావించకుండా ఇండియా టుడే సర్వే అంటూ ఆ పత్రికలో వార్తాకథనం రాశారు. అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి 17 లోక్‌సభ స్థానాలు వస్తాయని, వైసీపీ 8 స్థానాలకే పరిమితమవుతుందని సీ` ఓటర్ సర్వే తెలిపింది. అయితే, గతంలో సీ` ఓటర్ అంచనాలు ఘోరంగా తప్పయ్యాయి. 2019 ఎన్నికల్లో సీ` ఓటర్ సర్వే లెక్కలు పూర్తిగా తప్పయ్యాయి.
2019 ఎన్నికల్లో టీడీపీకి 14 లోక్‌సభ స్థానాలు వస్తాయని, 90 నుంచి 100 శాసనసభ స్థానాలు సాధిస్తుందని సీ ` ఓటర్ అభిప్రాయపడింది. చివరకు ఫలితాలు ఏ రకంగా వచ్చాయో అందరికీ తెలుసు. వైసీపీ 22 లోక్‌సభ స్థానాల్లో, 151 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 3 లోక్‌సభ స్థానాలకు, 23 శాసనసభ స్థానాలకు పరిమితమైంది.
2023లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో సీ ` ఓటర్ అంచనాలు పూర్తిగా తప్పాయి. మధ్యప్రదేశ్‌లో సీ` ఓటర్ సర్వే నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో కాంగ్రెస్‌కు 118 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేలింది. ఎగ్జిట్ పోల్ సర్వేలో 113 నుంచి 137 స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయని ఆ సంస్థ చెప్పింది. కానీ, కాంగ్రెస్ 66 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీకి 163 స్థానాలు వచ్చాయి.
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 45 నుంచి 51 స్థానాలు వస్తాయని ప్రీపోల్ సర్వే, 41 నుంచి 53 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చింది. చివరకు తేలిందేమిటంటే కాంగ్రెస్‌కు 35 స్థానాలు, బీజేపీకి 54 స్థానాలు వచ్చాయి. ఇదీ సీ` ఓటర్ సర్వేల విశ్వసనీయత. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ స్థానాల విషయంలో ఆ సంస్థ చెప్పిన లెక్కలు తారుమారు అవుతాయని చెప్పడానికి ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు.