పేదల ఇళ్ల లేఅవుట్‌ ధ్వంసంపై లోకాయుక్త ఆగ్రహం.. - నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశాలు

ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ లేఅవుట్‌ను ధ్వంసం చేశారు. పేదలకు ఇచ్చిన స్థలాల్లోని సరిహద్దు రాళ్లను తొలగించి జేసీబీలు, బుల్డోజర్లతో చదును చేసేశారు.

Advertisement
Update: 2024-06-26 05:42 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్‌ను టీడీపీ నాయకులు ధ్వంసం చేయడంపై లోకాయుక్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలను సుమోటోగా తీసుకోవాలని లోకాయుక్త, ఉప లోకాయుక్త నిర్ణయించాయి. అందులో భాగంగా ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయించి తమకు నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను లోకాయుక్త మంగళవారం ఆదేశించింది.

నంద్యాల జిల్లా డోన్‌ మండలం ఓబులాపురంలో పేద ప్రజలకు స్థలాల కేటాయించేందుకు లేఅవుట్‌ వేశారు. గ్రామ సమీపంలోని సర్వే నంబర్‌ 532లో 1.50 ఎకరాల పొలంలో వేసిన ఈ లేఅవుట్‌లో 65 మంది పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ లేఅవుట్‌ను ధ్వంసం చేశారు. పేదలకు ఇచ్చిన స్థలాల్లోని సరిహద్దు రాళ్లను తొలగించి జేసీబీలు, బుల్డోజర్లతో చదును చేసేశారు.

ఈ ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్త కథనాలను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని నిర్ణయించిన లోకాయుక్త.. తహసీల్దార్, ఆర్డీఓలతో పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని నంద్యాల కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ విచారణ నివేదికను 25 రోజుల్లోపు తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. దీనిపై విచారణను జూలై 26వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News