ఎస్వీ యూనివర్శిటీలో చిరుత.. విద్యార్థుల్లో భయం భయం

ఎస్వీ యూనివర్శిటీలోని వెటర్నరీ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు గత రాత్రి చిరుత కనపడిందని అంటున్నారు. రాత్రి వేళ విద్యార్థులంతా గుంపులు గుంపులుగా కాలేజీ గ్రౌండ్ లోకి వచ్చారు. చిరుతను కొంతమంది చూశారని అంటున్నారు విద్యార్థులు.

Advertisement
Update:2023-08-15 10:00 IST

అలిరిపిలో చిరుత దాడి, ఆరేళ్ల బాలిక మృతి, అనంతరం బోనులో చిరుత, టీటీడీ కొత్త నిర్ణయాలు.. ఇవన్నీ ఒక ఎపిసోడ్ లాగా జరిగాయి. అయితే తిరుమల మెట్ల మార్గం, ఘాట్ రోడ్ సమీపంలో మరిన్ని చిరుతలు సంచరిస్తున్నాయనే వార్తలు కలకలకలం రేపుతున్నాయి. ఇవి వట్టి పుకార్లు కాదు, చిరుత కదలికపై అటవీశాఖ అధికారిక సమాచారం. అయితే ఇప్పుడు ఎస్వీ యూనివర్శిటీలో కూడా చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కూడా యూనివర్శిటీ క్యాంపస్ లో అర్థరాత్రి చిరుతలు సంచరించేవి. ఇప్పుడు మరోసారి యూనివర్శిటీలో చిరుతల కదలికలు ఎక్కువ కావడంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

ఎస్వీ యూనివర్శిటీలోని వెటర్నరీ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు గత రాత్రి చిరుత కనపడిందని అంటున్నారు. రాత్రి వేళ విద్యార్థులంతా గుంపులు గుంపులుగా కాలేజీ గ్రౌండ్ లోకి వచ్చారు. చిరుతను కొంతమంది చూశారని అంటున్నారు విద్యార్థులు. తాము భయంతో బయటకు రాలేకపోతున్నామని, యూనివర్శిటీలోకి చిరుతలు రాకుండా ఫెన్సింగ్ వేయాలంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళ క్యాంటీన్ కి వెళ్లాలంటే కూడా భయపడుతున్నామని చెప్పారు విద్యార్థులు.

ఎక్కడివి ఈ చిరుతలు..?

తిరుమల అడవుల్లో చిరుతల సంచారం ఎక్కువే. కానీ ఇటీవల కాలంలో అవి జన సంచారం వైపు వస్తున్నాయి. ఎస్వీ యూనివర్శిటీ వైపు కూడా అడవుల నుంచి చిరుతలు వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఘాట్ రోడ్, కాలినడక మార్గాల్లో మాత్రం చిరుతల సంచారం అధికం కావడం ఇటీవలే ఎక్కువైంది. అటు భక్తులు భయం భయంగా కొండ ఎక్కుతున్నారు, ఇటు యూనివర్శిటీలో కూడా చిరుత అలికిడి కలకలం రేపుతోంది. 

Tags:    
Advertisement

Similar News